బ్రెట్‌లీ వర్సెస్ యువీ.. మళ్లీ తలపడబోతున్నారు

By Newsmeter.Network  Published on  8 Feb 2020 12:32 PM GMT
బ్రెట్‌లీ వర్సెస్ యువీ.. మళ్లీ తలపడబోతున్నారు

ఆస్ట్రేలియాలో సంభవించిన కార్చిచ్చు బాధితుల సహాయార్థం మాజీ క్రికెటర్లంతా కలిసి ఓ చారిటీ మ్యాచ్‌ ఆడనున్నారు. రెండు జట్లుగా (గిల్‌క్రిస్ట్XI, పాంటింగ్‌ XI) గా విడిపోయి మ్యాచ్‌ ఆడనున్నారు. తొలుత ఈ మ్యాచ్‌ ను శనివారం సిడ్నిలో నిర్వహించాలని అనుకున్నా.. వాతావరణం అనుకూలించలేదు. దీంతో ఆదివారం మెల్‌బోర్న్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది.

అనుకోకుండా మ్యాచ్‌ ఆదివారం జరనుండడంతో షేన్‌ వార్న్ జట్టుకు గిల్‌క్రిస్ట్ నాయకత్వం వహిస్తున్నాడు. ముందుగా ఈ జట్టుకు వార్న్ నాయకత్వం వహించాల్సి ఉంది. అయితే ఆదివారం వార్న్ కు ఇతర కార్యక్రమాలు ఉండడంతో అతడు ఈ మ్యాచ్‌ లో ఆడడం లేదు.ఇదిలా ఉంటే.. గిల్‌క్రిస్ట్ నాయకత్వంలో టీమిండియా ఆల్ రౌండర్‌ యువరాజ్‌ సింగ్ ఆడనుండగా.. పాంటింగ్ జట్టులో బ్రెట్‌లీ ఉన్నాడు. ఈ సందర్భంగా బ్రెట్‌లీ రేపు 150కిమీల వేగంతో బంతులేస్తే ఏమౌంతుందని యువీని ప్రశ్నించగా... తనదైన శైలిలో యువరాజ్‌ సమాధానమిచ్చాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రెట్‌లీ 150కిమీల వేగంతో బంతులు వేస్తాడని అనుకోవడం లేదన్నాడు. మహా అయితే 130-135కిమీల వేగంతో వేయవచ్చునని.. ఒకవేళ 150కిమీల వేగంతో వేస్తే .. నేను నాన్‌ స్ట్రైకింగ్‌ ఎండ్ ఉంటా అని యువీ ఫన్నీగా జవాభిచ్చాడు. గతంలో వీరిద్దరి మధ్య ఆసక్తికర పోరాలు జరిగిన సంగతి తెలిసిందే..

గిల్‌క్రిస్ట్‌ జట్టు: షేన్‌వాట్సన్‌, బ్రాడ్‌ హాడ్జ్‌, ఆడం గిల్‌క్రిస్ట్‌(కీపర్‌, కెప్టెన్‌), ఆండ్రూ సైమండ్స్‌, యువరాజ్‌ సింగ్‌, అలెక్స్‌ బ్లాక్‌వెల్‌, పీటర్‌ సిడిల్‌, కౌర్ట్నీవాల్ష్‌, ఫవద్‌ అహ్మద్‌, నిక్‌ రీవోల్ట్‌, కామెరాన్‌ స్మిత్‌.

పాంటింగ్‌ జట్టు : రికీపాంటింగ్‌(కెప్టెన్‌), జస్టిన్‌ లాంగర్‌, ఎలిసె విల్లాని, ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌, బ్రయన్‌ లారా, మాథ్యూహేడెన్‌, బ్రాడ్‌ హడ్డిన్‌(కీపర్‌), డానియల్‌ క్రిస్టియన్‌, లుక్‌ హోడ్జ్‌, వసీం అక్రమ్‌, బ్రెట్‌లీ.

Next Story