పంత్‌పై సానుభూతి చూపిన యువరాజ్‌..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Nov 2019 1:03 PM GMT
పంత్‌పై సానుభూతి చూపిన యువరాజ్‌..!

ముఖ్యాంశాలు

  • యువ ఆటగాళ్లను కుదురుకోనివ్వాలన్నా యువీ
  • పంత్ కు సెలక్టర్లు సమయం ఇవ్వాలన్న యువరాజ్
  • దూబేను తన ఆటను తాను ఆడనివ్వాలన్న డాషింగ్ ఆల్ రౌండర్

రిషభ్ పంత్‌కు తగినంత సమయం ఇవ్వాలన్నారు యువరాజ్. పంత్ ఆట తీరును మార్చుకుంటున్నాడని..ఇంకా మార్చుకునే సమయం ఇవ్వాలన్నారు. సలెక్టర్ల తీరుపై యువీ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. యువకులను మంచి ఆటగాళ్లగా తీర్చిదిద్ది గ్రౌండ్‌లోకి పంపాలన్నారు. రిషబ్ పంత్ దగ్గరకు బంతి వచ్చేసరికి దానిని కొట్టాలా..?లేదా అని ఆలోచిస్తున్నాడు. పంత్ ఆడింది 10 లోపు వన్డే మ్యాచ్‌లే కాబట్టి టైమ్ ఇస్తే బెటర్ అన్నాడు. అలాగే ..పంత్ కీపింగ్ లో కూడా లోపాలు ఉన్నాయని..సరిదిద్దుకోవడానికి సమయం ఇవ్వాలన్నారు. పంత్‌కు 4, 5 స్థానాలు బెటర్‌ అన్నాడు.

దూబెను తనతో పోల్చడంపై కూడా యువీ స్పందించాడు. ముందు అతని ఆటను ఆడనివ్వండి. కుదురుకున్నాక పోల్చవచ్చు అని చెప్పాడు. దూబే బ్యాటింగ్ శైలిలో చిన్నచిన్న సమస్యలున్నాయన్నారు. వాటిని మార్చుకుంటే దూబే మంచి ఆటగాడిగా తయారు అవుతాడని చెప్పాడు యువీ. మొత్తానికి యువీ ఆటగాళ్లకు మీడియా ముఖంగా కొన్ని సలహాలు, సూచనలు ఇవ్వడంతోపాటు మద్దతుగా కూడా నిలబడ్డాడు. దటీజ్ యువీ.

Next Story