అమరావతి: వైయస్సార్‌ రైతు భరోసాపై సీఎం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి సీఎం కార్యాలయంలో చేపట్టిన సమీక్షా సమావేశంలో ఆయన నేతలకు కీలక సూచనలు చేశారు. దీనిలో భాగంగా నవంబర్‌ 15 వరకు రైతులకు సంబంధించి గడువు పూర్తి చేసుకోవాలని సూచించారు. కౌలు రైతులకు సంబంధించి డిసెంబర్‌ 15 వరకు గడువు పెంపుకు అనుమతించారు. అయితే రైతులు, కౌలు రైతుల ఒప్పందాలు కుదర్చుకోవడానికి, ఒప్పందాలపై అవగాహన కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. దీనిలో భాగంగానే ప్రతి గ్రామంలోనూ పథకాలపై సోషల్‌ ఆడిట్‌ జరగాలని సీఎం అధికారులను ఆదేశించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.