వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే రోజాకు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. నగరి నియోజకవర్గంలోని పుత్తూరు మండలం కేబీఆర్‌పురంలో గ్రామ సచివాలయ ప్రారంభోత్సవానికి వెళ్లగా, అక్కడ వైసీపీ కార్యకర్తలు ఆమెను అడ్డుకున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇప్పటి వరకు తమను పట్టించుకోలేదని వారు ఆరోపించారు. కనీసం కార్యకర్తలను కూడా పట్టించుకున్న పాపనపోలేదని విమర్శించారు. వైసీపీ కార్యకర్తలు ఆమె కానును అడ్డుకున్నారు. సుమారు అరగంట పాటు ఆమె కారును కదలనివ్వకుండా చేశారు. రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రామ సచివాలయ ప్రారంభోత్సవానికి తమను పిలవకపోవడాన్ని వారు తప్పుబట్టారు.

దీంతో కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు కూడా వారిని నిలువరించే ప్రయత్నిం చేశారు. చివరకు రోజా కారు అద్దాలు దించి వారిని సర్ధి చెప్పే ప్రయత్నం చేయగా, ఎంతకి వినకుండా రోజాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక చేసేదేమి లేక రోజా 15 నిమిషాల్లోనే కార్యక్రమాలన్ని పూర్తి చేసి వెనుదిరిగారు. కాగా, మొదటి నుంచి కూడా ఆమె నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత ఉంది. గతంలో ఎమ్మెల్యేగా గెలిచినా పెద్దగా అభివృద్ధి పనులు చేపట్టలేదనే ఆరోపణలున్నాయి.

సుభాష్

.

Next Story