'ఆటో డ్రైవర్ ' వైఎస్ జగన్
By న్యూస్మీటర్ తెలుగు Published on 4 Oct 2019 8:06 PM IST- 'వైఎస్ఆర్ వాహన మిత్ర'ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
- మాట ఇచ్చిన చోటనే నిలబెట్టుకున్న సీఎం వైఎస్ జగన్
- ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం
- సీఎం జగన్ చేతుల మీదుగా వాహనదారులకు అందజేత
ఏలూరు: పాదయాత్రలో ఎక్కడ మాట ఇచ్చాడో అక్కడే మాటను నిలబెట్టుకున్నారు వైఎస్ జగన్. మేనిఫెస్టోను దైవంగా భావించే వైఎస్ జగన్ ఒక్కో హామీని నెరవేరుస్తూ ముందుకు పోతున్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే 'వైఎస్ఆర్ వాహన మిత్ర ' పథకానికి శ్రీకారం చుట్టారు. చరిత్రలో ఏ పాలకుడు చేయని విధంగా ఆటో, టాక్సీ డ్రైవర్ల సంక్షేమానికి శ్రీకారం చుట్టారు. పేదలకు ఆర్థిక భద్రత కల్పించే ..ఏటా రూ.10వేలు ఇచ్చే 'వైఎస్ఆర్ వాహన మిత్ర' పథకాన్ని ప్రారంభించారు వైఎస్ జగన్.
పాదయాత్రలో ఆటో, టాక్సీ డ్రైవర్ల కష్టాలు చూసి వైఎస్ జగన్ చలించిపోయారు. పాదయాత్రలో భాగంగా ఏలూరు బహిరంగ సభలో ఏటా రూ.10వేలు చొప్పున ఆర్ధిక సాయం చేస్తానని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం 'వైఎస్ఆర్ వాహన మిత్ర' ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్.
ఈ పథకం కింద 1,73,531 మంది లబ్దిదారులు ఏడాదికి రూ. 10 వేల చోప్పున అందుకోనున్నారు. ఇండోర్ స్టేడియంలో ‘వైఎస్సార్ వాహన మిత్ర’ప్రారంభించారు. ఈ పథకం కింద లబ్ధి పొందే వారిని ఆప్యాయంగా పలకరించారు. ‘వైఎస్సార్ వాహన మిత్ర’పథకంతో తమకు చేయూతనిచ్చిన సీఎం వైఎస్ జగన్కు ఆటో డ్రైవర్లు పుష్ప గుచ్ఛాలు, గజమాలతో ఘనంగా సత్కరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘2018, మే 14న పాదయాత్రలో ఆటో కార్మికులకు హామీ ఇచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే హామీ అమలు చేశాం. ఆటో కార్మికులను కష్టాలను కళ్లారా చూశా. అందుకే వైఎస్సార్ వాహన పథకాన్ని రూపొందించాం. ఈ పథకం కింద ఆటో డ్రైవర్లకు రూ. 10 వేల చొప్పున.. ఐదేళ్లలో రూ. 50 వేలు జమ చేస్తాం. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు చూడకుండా అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ పథకం అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు.
అంతకు ముందు ప్రభుత్వ వైద్య కళాశాలకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు.