జాతీయ పతాకం రంగులు పోయి..వ్తెసీపీ కలర్స్ వచ్చే..!!
By సత్య ప్రియ Published on 30 Oct 2019 12:19 PM GMTగ్రామ సచివాలయాలకు రంగులు వేసే ప్రక్రియలో వైసీపీ పార్టీ అత్యుత్సాహం ప్రదర్శించింది. కర్నూల్ లోని తుమ్మడపల్లె గ్రామ పంచాయతీ కార్యాలయ గోడలకి ఉన్న త్రివర్ణ పతాకంలోని మూడు రంగులను తొలగించి, తమ పార్టీ రంగులను గోడలకి వేశారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు ఈ విషయాన్ని ట్విట్టర్ లో పంచుకున్నారు. "త్రివర్ణ పతాకాన్ని ఇలా అవమానించిన వారిని నేను ఎప్పుడూ చూడలేదు" అని ఆయన తన ట్వీట్ లో అన్నారు. జగన్ ప్రభుత్వం చేసిన హేయమైన చర్యను చూసి తాను దిగ్భ్రాంతి చెందాననీ, వారు క్షమాపణ చెప్పి తీరాలనీ ఆయన అన్నారు.
జగన్ ప్రభుత్వం చేసిన ఈ పనికి వ్యతిరేకంగా చాలామంది ట్విట్టర్ వేదికగా విమర్శించారు. కొందరు నీలం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉన్న చెట్లూ, బారికేడ్లూ, చెత్త కుప్పల ఫోటోలను ట్విట్టర్ లో పంచుకున్నారు.
ఇవాన్నింటికీ తమ పార్టీ రంగులు వెసారు, కనీసం రోడ్లనైనా వదిలెశారు... హమ్మయ్య.. అంటూ ఒక నెటిజెన్ సటైర్లు వేశారు.
సహజంగా, పాలనలో ఉన్న పార్టీ, తమ పార్టీ రంగులని ప్రభుత్వ పధకాల పైన ముద్రించాలని చూస్తుంది. తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రేషన్ కార్డులని పసుపు రంగులో ముద్రించారు. రాషన్ కార్డు ఉన్న జనానికి ఉచిత కానుకలు పసుపు రంగు బ్యాగులలో ఇచ్చేవారు. అన్నా క్యాంటీన్లకు కూడా పసుపు రంగు వేశారు.
ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఇదే పంధాలో పని చేస్తున్నట్టు కనిపిస్తోంది. గ్రామ పంచాయతీలకు పార్టీ రంగులు పులుముతున్నారు.
బిజేపి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కన్నా లక్ష్మి నారాయణ ప్రభుత్వ చర్యను ఎత్తి చూపారు. వైసీపీ గోడలకు రంగులేసుకోవడానికి పనికి వస్తుంది కానీ రాష్ట్రం ఏలడానికి కాదు అని ట్వీట్ చేసారు.