ముఖ్యాంశాలు

 • విజయవాడ ఇసుక సత్యాగ్రహంలో పాల్గొన్న పురంధేశ్వరి
 • కార్మికుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
 • విజయవాడ: అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకున్న ఏకైక ప్రభుత్వం వైసీపీనేని బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. విజయవాడలో ఇసుక సత్యాగ్రహంలో పురంధేశ్వరి పాల్గొన్నారు. ప్రభుత్వానికి ఎనిమిది నెలల సమయం ఇవ్వాలని నిర్ణయించాం.. కానీ అధికారంలోకి వచ్చిన మొదటి నుంచే ప్రజల్లో వ్యతిరేకత రావడంతో బీజేపీ పోరాటాలకు దిగిందన్నారు.

  50 లక్షల భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక అల్లాడుతున్నారని.. కార్మికుల కష్టాలను ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని పురంధేశ్వరరి ఆరోపించారు. మంత్రులు.. భవన నిర్మాణ కార్మికులను అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నదుల్లో వరద గడిచిన రెండు నెలల పాటే ఉంది. అసలు ముందుగా ఇసుకను ఎందుకు స్టోర్‌ చేయలేదన్నారు.

  ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని బీజేపీ మహిళా నేత పురంధేశ్వరి విమర్శించారు. రాష్ట్రంలో సీఎం జగన్‌ అవగాహన లేమితో తీసుకుంటున్న నిర్ణయాలతో పెట్టుబడులు వచ్చే అవకాశం లేదనన్నారు. బీజేపీ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంది. భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటామని దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు.

  న్యూస్‌మీటర్ తెలుగు

  Next Story