ఆ సినిమాకు సీఎం జగన్ ఆశీస్సులు.. స్పెషల్ ఎంటీ.?
By న్యూస్‌మీటర్ తెలుగు
జేఎస్‌ఆర్ మూవీస్ పతాకంపై బి.లింగుస్వామి సమర్పణలో జొన్నలగడ్డ శ్రీనివాస్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'ఆటో రజని'. 'ప్రేమెంత పనిచేసే నారాయణ' సినిమాలో తన యాక్టింగ్‌తో మంచి పేరు తెచ్చుకున్న జొన్నలగడ్డ హరికృష్ణ హీరోగా 'ఆటో రజని' చిత్రం తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమాకు ఏపీ సీఎం వైఎస్ జగన్ తన ఆశీస్సులను అందజేశారు. దర్శకులు జొన్నలగడ్డ శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం జగన్‌గారు ఎంతో బిజీగా ఉండి కూడా ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన మా హీరోకు బ్లెస్సింగ్స్ అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జొన్నలగడ్డ హరికృష్ణ ..వైఎస్ జగన్ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఏపీ సీఎం జగన్ ఆశీస్సులు అందుకున్న మొదటి సినిమాగా 'ఆటో రజని' చరిత్రలో నిలిచిపోతుందన్నారు దర్శక, నిర్మాతలు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. హిరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణలు వివరాలు త్వరలో వెల్లడిస్తామని దర్శకులు జొన్నలగడ్డ శ్రీనివాస్ తెలియజేశారు.