వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పిటిష్లపై ఏపీ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఉన్నత న్యాయ స్థానంలో తమ వాదనను వినిపించారు. అయితే.. అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేనందున ఈ కేసు తదుపరి విచారణను న్యాయమూర్తి ఈ నెల 20కి వాయిదా వేశారు.

ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వివేకా భార్య సౌభాగ్యమ్య, కూతురు సునీతా, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి లు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.