వైఎస్ జగన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకు పోయింది - టీడీపీ
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 Oct 2019 1:22 PM GMT
అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై మాజీమంత్రి దేవినేని ఉమ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ సర్కార్ అవినీతి ఊబిలో కూరుకుపోయిందని దేవినేని ఉమ ఆరోపించారు. పోలీసు అధికారుల వలయంలో లక్షల రూపాయాలు చేతులు మారుతున్నాయన్నారు. రాష్ట్రంలో జగన్ సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని దేవినేని ఉమా మండిపడ్డారు. బలహీన వర్గాలకు ఇవ్వాల్సిన రుణాలను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లీస్తున్నదని మాజీ మంత్రి కొల్ల రవీంద్ర ఆరోపించారు. బలహీనవర్గాలను వైసీపీ ప్రభుత్వం అణగదొక్కుతున్నదని విమర్శించారు. బీసీ కార్పొరేషన్ ద్వారా ఇవ్వాల్సిన రుణాలను ఇవ్వడం లేదన్నారు. బ్యాంకుల నుంచి సమ్మతి లేఖలు తెచ్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం లేదని కొల్లు రవీంద్ర విమర్శించారు.
Next Story