హైదరాబాద్: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత విచారణకు మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను సిబిఐ కోర్టు విచారణకు స్వీకరించింది. ముందుగా సిబిఐ కోర్టులో పిటిషన్ విచారణ అర్హతలపై వాదనలు జరిగాయి.

వ్యక్తిగత హాజరు మినహాయింపుపై విచారణను గతంలో హైకోర్టు కొట్టి వేసింది కదా అని సీబీఐ కోర్టు పిటిషనర్‌ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. దీనిని అడ్వొకేట్ సమాధానమిస్తూ..ప్రస్తుతం పరిస్థితులు మారినందున మళ్ళీ విచారణ చేపట్టవచ్చని జగన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. చివరికి సిబిఐ కోర్టు వ్యక్తిగత హాజరు పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story