8 ఏళ్ల బుడ్డోడి ఆదాయం రూ.184 కోట్లు..!

By సుభాష్  Published on  19 Dec 2019 8:07 AM GMT
8 ఏళ్ల బుడ్డోడి ఆదాయం రూ.184 కోట్లు..!

ఏనిమిదేళ్ల చిన్నాడి ఆదాయం ఎంతో తెలిస్తే ప్రతిఒక్కరు షాకవ్వాల్సిందే. టెక్సాస్‌ కు చెందిన ర్యాన్ కాజీ అనే ఈ బుడ్డోడి యూట్యూబ్ ఛానెల్ 2019 ఆదాయం రూ.26మిలియన్ డాలర్లు అంటే రూ.184.39కోట్లకు పై మాటే. 2015లో చిన్నగా ప్రారంభించిన ఈ బుడ్డొడి చానెల్‌ క్రమ క్రమంగా ఊపందుకుంది. ర్యాన్ టాయ్స్‌రివ్యూ అనే పేరిట మొదలై 22.9మిలియన్ సబ్‌స్క్రైబర్స్‌ను సంపాదించగలిగిందంటే ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోవాల్సిందే. కొందరు పుస్తకాలు చేతపట్టుకుని బడికి వెళ్లాల్సిన చిన్నారులే కోట్లకొద్ది సంపాదనకు పరుగులు పెడుతున్నారు. వయసులో సంబంధం లేకుండా టాటెంట్‌ ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నాడు ఈ చిన్నారి.

ఒక వీడియోకు 35బిలియన్ వ్యూస్ వచ్చాయంటే అది మాములు విషయం కాదనే చెప్పాలి. ఈ చిన్నోడి వీడియోలు ఎంత ఫేమస్‌ అయ్యాయంటే అత్యద్భుతమైన ఫీట్స్ చేసే టెక్సాస్ కంపెనీను వెనుకపడేలా చేసేసింది. వినియోదారులకు హెలికాఫ్టర్ లో నుంచి బాస్కెట్‌బాల్స్ ఆడే ఫీట్ ల కంటే ర్యాన్ రివ్యూనే నచ్చడం మొదలుపెట్టాయి.

టెక్సాస్‌ నగరంలో ఉండే షియాన్‌ కాజీ, లోన్‌ కాజీల కొడుకే ర్యాన్‌ కాజీ. తన తండ్రి పని ముగిసిన తర్వాత యూట్యూబ్‌ చూస్తూ ఉండేవాడు. అది చూసి ర్యాన్‌.. ఒక రోజు షియాన్‌ను తాను వీడియోలు చేస్తానని అడిగాడు. వెంటనే 'ర్యాన్‌ టాయ్స్ రివ్యూ' అనే పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించాడు. లెగో రైలు సెట్‌ను కొనుగోలు చేసిన ర్యాన్‌‌తో రివ్యూ వీడియోను పోస్టు చేయించారు. ప్రారంభంలో చిన్న చిన్నగా మొదలైన 'ర్యాన్‌ ఫిక్సర్‌ కార్‌' రివ్యూకు భారీ స్పందన వచ్చింది. 935 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. మొదటగా చానెల్‌కు అంతగా ఆదరణ లేకపోయినా, ర్యాన్‌ వీడియో పోస్టుతో అంతనంత ఎత్తుకు పోయేలా చేసింది.

ర్యాన్‌ సెలబ్రిటీగా మారిపోయి వీడియోలకు బాగా డిమాండ్‌ పెరిగింది. యూట్యూబ్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న వారిలో ర్యాన్‌ మొదటిస్థానంలో ఉన్నాడు. ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించుకున్న ర్యాన్ 2018 సంవత్సర ఆదాయం 22మిలియన్ డాలర్లు, 2019లో 26మిలియన్ డాలర్లతో నెం.1 స్థానానికి అందుకోగలిగాడు. ఇప్పటి వరకు అతను వెయ్యి కోట్లకు పైగానే సంపాదించాడట. కాగా, ప్రజలను వినియోగదారులుగా మార్చటానికి ప్రతి ఒక్కరినీ ప్రచారకర్తగా మార్చుకోవటమే కార్పొరేట్ వ్యూహం. చిన్నపిల్లలు చేస్తున్నారనగానే వీక్షకులు చూపే ఆసక్తి ప్రత్యేకంగా ఉంటుందనే చెప్పాలి. ఆ ఆసక్తే వాళ్లను వస్తువులు కొనేలా చేస్తుంది. పుస్తకాలు చేత పట్టుకుని బడికెళ్లాల్సిన వయస్సులో అత్యధిక పారితోషకం అందుకుంటున్న వ్యక్తిగా ఏకంగా ఫోర్బ్స్ మేగజైన్‌లో చోటు సంపాదించాడు. తాజాగా ఫోర్బ్స్ మేగజైన్ విడుదల చేసిన జాబితాలో 2019 సంవత్సరానికిగాను యూట్యూబ్ ద్వారా అత్యధిక పారితోషకం (26 మిలియన్ డాలర్లు) అందుకున్న వ్యక్తిగా ర్యాన్ కాజీ గుర్తింపు పొందాడు.

Next Story