Fact Check : సెప్టెంబర్ 1 నుండి దేశంలో కరెంట్ బిల్లులు మాఫీ చేయనున్నారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Sept 2020 7:10 AM IST
Fact Check : సెప్టెంబర్ 1 నుండి దేశంలో కరెంట్ బిల్లులు మాఫీ చేయనున్నారా..?

సెప్టెంబర్ 1 నుండి దేశంలో కరెంట్ బిల్లులు మాఫీ చేయనున్నారంటూ DL News అనే యూట్యూబ్ ఛానల్ లో వీడియోను అప్లోడ్ చేశారు. ఆ యూట్యూబ్ ఛానల్ కు 1.38 మిలియన్ల సబ్ స్క్రైబ్ర్లు ఉన్నారు. ఏప్రిల్ 1, 2020 నుండి ఏ ఇంటి కరెంటు బకాయి అయినా.. రైతుల పంటభూములకు చెందిన కరెంటు బకాయిలైనా ఉంటే సెప్టెంబర్ 1, 2020న కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తోందని ఆ వీడియోలో తెలిపారు.

ఈ అవకాశం లభించాలంటే మీరు ఓ లిస్టులో ఎన్ రోల్ చేసుకోవాల్సి ఉంటుందని వీడియోలో ఉంది. ఒక్కసారిగా మీ పేరు ఆ లిస్టులో చేరిపోతే మీ బకాయిలు మొత్తం రద్దయిపోతాయని తెలిపింది. రిజిస్టర్ అవ్వడానికి ప్రభుత్వం సూచించినట్లుగా చేయాలని.. 'Modi Yojana List' అనే యూట్యూబ్ ఛానల్ ను తప్పకుండా సబ్ స్క్రైబ్ చేసుకోవాలని తెలిపారు. 'Modi Yojana List' అనే యూట్యూబ్ ఛానల్ లో ఇప్పటి వరకూ ఎటువంటి కంటెంట్ ను పోస్టు చేయలేదు. ఇప్పటికే చాలా మంది సబ్ స్క్రైబ్ చేసుకున్నారు.

ఈ యూట్యూబ్ ఛానల్ ప్రభుత్వానికి చెందిన యూట్యూబ్ ఛానల్ అని.. కామెంట్ బాక్సులో ఎవరి పేరైతే కామెంట్ చేస్తారో కరెంటు బిల్లు మాఫీ చేసే లిస్టులోకి వెళుతుందని తెలిపారు. ప్రభుత్వం త్వరలోనే వెబ్సైట్ ను అప్డేట్ చేస్తుందని.. అందులో మూడు డాక్యుమెంట్లను అప్లోడ్ చేస్తే కరెంటు బకాయిలు పూర్తిగా రద్దయిపోతాయని తెలిపింది. ప్రభుత్వం ఇచ్చిన లింక్ లోకి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఎలక్ట్రిసిటీ బిల్ కు సంబంధించిన స్కాన్ చేసిన కాపీలను అప్లోడ్ చేయాలని తెలిపారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్టు పచ్చి అబద్ధం. అలాంటి స్కీమ్ ను ప్రభుత్వం ఎక్కడా అమలు చేయడం లేదు.

ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పిఐబి) తమ ట్వీట్ లో ఇలాంటి పథకాన్ని భారత ప్రభుత్వం తీసుకుని రాలేదని స్పష్టం చేసింది.

ఈ ఫోటో మీద నిజ నిర్ధారణ చేసిన PIB ఫ్యాక్ట్ చెక్ సంస్థ కూడా అదొక ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది.

एक #Youtube वीडियो में यह दावा किया जा रहा है कि बिजली बिल माफी योजना 2020 के तहत 1 सितंबर से पूरे देश मे सबका बिजली बिल माफ होगा।

#PIBFactCheck: यह दावा फर्जी है। सरकार द्वारा ऐसी किसी योजना की घोषणा नहीं की गई है

ఒక యూట్యూబ్ వీడియోలో కరెంటు బిల్లు మాఫీ యోజన కింద అందరి కరెంటు బిల్లులు మాఫీ అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదని పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వం ఒక్కో కరోనా పేషెంట్ కు ఒకట్టిన్నర లక్ష రూపాయలు మున్సిపాలిటీకి ఇస్తోంది అన్న కథనంలో కూడా నిజం లేదని చెప్పుకొచ్చింది.

కొద్దిరోజుల కిందట.. కేంద్రప్రభుత్వం ఆన్ లైన్ క్లాసులకు హాజరు అయ్యే విద్యార్థులకు స్మార్ట్ ఫోన్ లు ఇస్తుందన్న ప్రచారంలో కూడా నిజం లేదని తేల్చింది.

సెప్టెంబర్ 1 నుండి దేశంలో కరెంట్ బిల్లులు మాఫీ చేయనున్నారన్న కథనాల్లో 'నిజం లేదు'.

Next Story