క‌ళ్లు చెదిరే క్యాచ్‌తో మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచిన యూసఫ్‌ పఠాన్‌.!

By Medi Samrat  Published on  9 Nov 2019 7:24 AM GMT
క‌ళ్లు చెదిరే క్యాచ్‌తో మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచిన యూసఫ్‌ పఠాన్‌.!

ముఖ్యాంశాలు

  • వైర‌ల్‌గా మారిన క్యాచ్ వీడియో
  • కొనియాడిన అఫ్గాన్‌ సంచలనం రషీద్‌ ఖాన్‌

యూసఫ్‌ పఠాన్ టీమిండియా క్రికెటర్‌. చాలా ఏళ్లుగా విన‌ప‌డ‌ని ఈ పేరు.. ఒక్క‌సారిగా వార్త‌ల్లోకి వ‌చ్చింది. వివ‌రాళ్లోకెళితే.. 2012లో చివరిసారి భారత్‌ తరఫున ఆడిన యూసఫ్‌ పఠాన్‌.. ఇంకా దేశవాళీ మ్యాచ్‌లు మాత్రం ఆడుతూనే ఉన్నాడు. తాజాగా సయ్యద్‌ ముస్తాక్‌ ఆలీ ట్రోఫీ టీ20లో భాగంగా యూసఫ్‌ పఠాన్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టి మళ్లీ వార్తల్లో నిలిచాడు.

బరోడా తరఫున ఆడుతున్న యూసఫ్‌.. శుక్రవారం గోవాతో జరిగిన మ్యాచ్‌లో ఒక స్టన్నింగ్‌ క్యాచ్‌తో అలరించాడు. గోవా కెప్టెన్‌ దర్శన్‌ మిశాల్‌ కవర్స్‌ మీదుగా షాట్‌ ఆడగా అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న యూసఫ్‌ ఒక్కసారిగా గాల్లోకి డైవ్‌ కొట్టి క్యాచ్‌ అందుకున్నాడు. గోవా ఇన్నింగ్స్‌ 19 ఓవర్‌ను అరోథి వేయగా దర్శన్‌ భారీ షాట్‌ కొట్టబోయాడు. అది కవర్స్‌ మీదుగా గాల్లోకి లేచిన సమయంలో యూసఫ్‌ మెరుపు ఫీల్డింగ్‌తో అతన్ని పెవిలియన్‌కు పంపాడు.

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట‌ వైరల్‌గా మారింది. తన సోదరుడు ఇర్ఫాన్ ప‌ఠాన్.. క్యాచ్‌కు సంబంధించిన వీడియోను ట్వీటర్‌లో షేర్‌ చేశాడు. దీనిపై స్పందించిన అఫ్గాన్‌ సంచలనం రషీద్‌ ఖాన్‌.. అదొక అద్భుతమైన క్యాచ్‌ అంటూ యూస‌ఫ్ ను కొనియాడాడు.



Next Story