ఢిల్లీ: ఆ యువకుడు సింహంతో చెలగాటం ఆడాడు. జూ లో మృగరాజు ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించి సింహానికి ఎదురుగా కూర్చున్నాడు. సింహాన్ని రెచ్చగొట్టేందుకు యత్నించాడు. అయితే సింహా కొద్దిసేపు గమనించిన తర్వాత అతడిపై దాడికి ఉపక్రమించింది. ఈ ఘటనతో అప్రమత్తమైన జూ సిబ్బంది వెంటనే అతన్ని రక్షించారు. అయితే ఈ సంఘటన ఢీల్లీలోని జంతు ప్రదర్శనశాలలో జరిగింది.యువకుడు బీహార్‌కు చెందిన రెహ్మన్‌ఖాన్‌గా గుర్తించారు. అయితే ఆ యువకుడికి మతిస్థిమితం సరిగా లేనట్లుగా జూ అధికారులు భావిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=TiESbGI_qxs

 

 

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.