'ఏడు చేపల కథ' సినిమాలో ఏముంది ?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Nov 2019 12:25 PM GMT
ఏడు చేపల కథ సినిమాలో ఏముంది ?

అడల్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన మూవీ 'ఏడు చేపల కథ'. అభిషేక్ రెడ్డి పచ్చిపాల, భాను శ్రీ, ఆయేషా సింగ్, మేఘనా చౌదరి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను జే చైతన్య అనే దర్శకుడు తెరకెక్కించారు. జీవీఎన్ శేఖర్ రెడ్డి నిర్మించారు. కవి శంకర్ సంగీతాన్ని సమకూర్చారు. ఫస్ట్ లుక్, పోస్టర్లు, ట్రైలర్లతో సంచలనం సృష్టించిన 'ఏడు చేపల కథ' సినిమా నవంబర్ 7న రిలీజ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్ టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. కంప్లీట్ గా పెద్దలు మాత్రమే చూసే సినిమాలో ట్రైలర్ ను దర్శకుడు చైతన్య రూపొందించారు. సినిమాను పిల్లలు చూడొద్దని సినిమా బృందమే చెప్పేయడం మరో విశేషం. మెయిన్ లీడ్ చేస్తున్న అభిషేక్... సినీ ప్రియులకు ఈజీగా కనెక్ట్ అయ్యారేమో అనిపిస్తోంది. ఎందుకంటే అతనిలోనే ఫ్రెష్ లుక్, వాయిస్ బేస్, ఇన్నోసెన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఇక నటి భాను శ్రీ మరో లీడ్ లో నటించారు. కథ విషయానికొస్తే... హీరో అభిషేక్ ఒక అరుదైన జబ్బుతో బాధపడుతుంటారు. ఆ జబ్బు నుంచి అతను బయటపడాలంటే ప్రతి నెలా రక్త మార్పిడి జరగాలి. ఆ రక్తం కోసం ఏడుగురు మహిళలను అభిషేక్ కలుస్తారు. వారి దగ్గర నుంచి తనకు కావాల్సిన రక్తం దక్కేలా అభిషేక్ ఏం చేస్తాడు....ఆ ఏడుగురు మహిళలు రక్తం ఇచ్చినందుకుగాను అతన్ని ఎలా వినియోగించుకున్నారు అనేది సినిమా కథాంశంగా కన్పిస్తుంది. ట్రైలర్ చూడగానే అసభ్యకర ఫీలింగ్ కలిగేలా ఉన్నా... ఎంటర్ టైన్ మెంట్ దారిలో సినిమా తెరకెక్కించామని, సినిమాలో మంచి సందేశం కూడా ఉందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ట్రైలర్ చూసిన యూత్ ఎవరైనా కచ్చితంగా ఒకసారి చూసేందుకు మొగ్గు చూపుతారు. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా చూసేందుకు థియేటర్లకు రావడం కష్టమనే భావన కలుగుతుంది. నవంబర్ 7 గురువారం రోజున రిలీజై కాబోతున్న 'ఏడు చేపల కథ' ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Next Story
Share it