ఏపీ సీఎం జగన్, తెలంగాణ మంత్రి కేటీఆర్ 'యాత్ర' డైరక్టర్ ట్విట్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on : 5 Oct 2019 11:16 PM IST

'యాత్ర' డైరక్టర్ మహి మంచి డైరక్టరే కాదు..పర్యావరణ ప్రియుడు కూడా. డైరక్టర్ మహి వి రాఘవ ఆసక్తికరమైన ట్విట్ చేశాడు. ఫిలిప్పీన్స్‌లో పర్యావరణ రక్షణలో ఓ చట్టం తెచ్చారు. ఆ దేశంలోని విద్యార్ధులు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే లోపు ఒక్కొక్కరు 10 మొక్కలు నాటాలి. దీనికి విద్యార్ధులు, స్వచ్ఛంద సంస్థల నుంచి మంచి స్పందన వస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను మహి ట్విట్ చేశాడు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలుగు రాష్ట్రాల్లో ఈ చట్టం తీసుకురావాలని మహి ట్విట్‌లో కోరారు. అంతేకాదు..వారిద్దరికి ట్యాగ్ కూడా చేశారు. దీనిని కేటీఆర్ లైక్ చేశారు.
Next Story