యాదాద్రి జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా కర్నల్ సంతోష్‌బాబు భార్య
By సుభాష్ Published on 2 Nov 2020 8:11 AM GMTఇటీవల గల్వాన్ లోయలో భారత్ -చైనా ఘర్షణలో కర్నల్ సంతోష్ బాబు అమరుడైన విషయం తెలిసిందే. అయితే సంతోష్ భార్య సంతోషికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రం అందజేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. యాదాద్రి జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా నియామకం అయ్యారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే సంతోషి కలెక్టరేట్ కార్యాయానికి చేరుకుంది. మరి కొద్దిసేపట్లో ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, సంతోషికి ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌గా నియమించారు. తాజాగా యాదాద్రి జిల్లాకు ట్రైనీ కలెక్టర్‌గా కేటాయించడంతో ఈ రోజు ఆమె విధుల్లో చేరనున్నారు.
సూర్యాపేటకు చెందిన సంతోష్‌బాబుకు రాష్ట్ర ప్రభుత్వం ఘన నివాళులు అర్పించింది. ఈ క్రమంలో సంతోష్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సంతోషి భార్యకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు స్థలం, రూ.5 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు కేసీఆర్. ఆ మేరకు గతంలోనే ఆమె నియామక పత్రంతో పాటు స్థల పత్రాలు, ఐదు కోట్ల చెక్కును సంతోష్‌కి ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేశారు. ఇప్పుడు తాజాగా ఆమెను యాదాద్రి భువనగిరి జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా నియమించారు.