వరల్డ్స్ షార్టెస్ట్ మ్యాన్‌ మగర్‌ మృతి

By అంజి  Published on  19 Jan 2020 12:07 PM GMT
వరల్డ్స్ షార్టెస్ట్ మ్యాన్‌ మగర్‌ మృతి

ప్రపంచపు పొట్టి వ్యక్తిగా గిన్నిస్‌ బుక్‌లోకెక్కిన ఖాగేంద్ర థాపా ఇకలేరు. నేపాల్‌ దేశానికి చెందిన ఖాగేంద్ర గత కొంతకాలంగా న్యూమోనియాతో బాధపడుతున్నాడు. పొఖారా సిటీలోని మనిపాల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఖాగేంద్ర కన్నుమూశాడు. న్యూమోనియా ప్రభావం అతని గుండె పడడంతో ఖాగేంద్ర చనిపోయాడు. ఈ విషయాన్ని అతని సోదరుడు మహేష్‌ థాపా మాగర్‌ తెలిపారు. 27 ఏళ్ల ఖాగేంద్ర 2.4 అంగుళాల పొడవు ఉండేవాడు. అతని కేవలం 6 కేజీల బరువు మాత్రమే. 2010లో ప్రపంచంలోనే అత్యంత షార్టెస్ట్‌ మ్యాన్‌గా అతను గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కాడు. ఈ సందర్భంగా గిన్నిస్‌ బుక్‌ సర్టిఫికెట్‌తో ఫోటో దిగాడు. నేపాల్‌లో జరిగిన మహిళల అందాల పోటీల్లోని విజేతలో ఖాగేంద్ర ఫోటోలకు పోజులిచ్చాడు.

World shortest man

ఆ తర్వాత ఖాగేంద్ర రికార్డును చంద్ర బహదూర్‌ డాంగీ బ్రేక్‌ చేశాడు. చంద్ర బహదూర్ డాంగి 54.6 సెంటీమీటర్ల పొడవు ఉండేవాడు. 2015లో డాంగీ మరణించడంతో తిరిగి మళ్లీ ఆ రికార్డ్‌ ఖాగేంద్రకే దక్కింది. ఖాగేంద్ర చనిపోయాడన్న వార్త తెలుసుకున్న గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ క్రెయిన్‌ గ్లెన్డే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆరు కిలోల బరువుతో ఖాగేంద్రకు జీవతం సవాలుగా ఉండేదని.. అయిన అతను ఎక్కడా వెనక్కు తగ్గకుండా ముందుకెళ్లాడని పేర్కొన్నారు. నేపాల్‌ టూరిజం అంబాసిడర్‌గా పని చేశాడు.

Next Story