నవతరం నరరూప రాక్షసుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌

By Newsmeter.Network  Published on  18 Jan 2020 6:20 AM GMT
నవతరం నరరూప రాక్షసుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌

ముఖ్యాంశాలు

  • తవ్వినకొద్దీ వెలుగు చూస్తున్న కరేబియన్ దీవుల నిజాలు
  • వర్జిన్ ల్యాండ్స్ ఎస్టేట్ ని వ్యభిచార కూపంగా మార్చిన జెఫ్రీ
  • అనేక అరాచకాలు చేసిన ఈ యుగపు నరరూపరాక్షసుడు
  • వందలాదిమందిని వ్యభిచారకూపంలోకి నెట్టిన ఘనుడు
  • చిన్నచిన్న పిల్లల్నికూడా వదిలిపెట్టని అత్యంత క్రూరుడు
  • దక్షిణ అమెరికా మోడల్స్ జెఫ్రీ ఎప్ స్టీన్ ప్రైమరీ టార్గెట్
  • దొంగ వీసాలతో బాలికల్ని సరిహద్దులు దాటించిన జెఫ్రీ
  • జెఫ్రీకి ప్రత్యేకంగా అతి సంపన్నమైన జెట్ విమానం
  • తన సొంత విమానంలోనే యువతులను తరలించిన జెఫ్రీ
  • జెఫ్రీ అరాచకాలకు సంబంధించిన అతిపెద్ద డేటాబేస్

జెఫ్రీ ఎప్ స్టీన్. ఈ పేరు చెబితే చాలు యువతులకు, మహిళలకూ వెన్నులోంచి వణుకు పుట్టుకొస్తోంది. ఇతను చేసిన దుర్మార్గాలు సాదాసీదావేం కావు. వందలాదిమంది యువతుల్ని ఈ నరరూప రాక్షసుడు వ్యభిచార కూపంలోకి నెట్టాడు. అత్యంత చాకచక్యంగా ఎంతమంది ఆడవాళ్లను ట్రాప్ చేసి 2018లో కరేబియన్ దీవుల్లోని తన సొంత ద్వీపానికి ఫ్లష్ బిజినెస్ కోసం ఎత్తుకెళ్లిపోయాడు. మొత్తంగా ఆ ద్వీపాన్నంతటినీ పూర్తి స్థాయిలో పర్యాటక కేంద్రం పేరుతో వ్యభిచార కూపంగా మార్చిపారేసి కోట్లాదిరూపాయలు ఆర్జించుకున్నాడు.

పాపం పండింది. జెప్రీ చేసిన అరాచకాలు వెలుగు చూశాయి. పోలీసులు ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసి కోర్టు మెట్లు ఎక్కించారు. జెఫ్రీని విచారించిన పోలీసులు సైతం విస్తుపోయే నిజాల్ని విచారణలో అతడు వెల్లడించాడు. జెఫ్రీ దగ్గర ఎవర్ని ఎప్పుడు ఎక్కడ్నుంచి ఎలా ఏ మార్గంలో కరేబియన్ దీవుల్లో ఉన్న తన సొంత ద్వీపానికి తరలించాడో చాలా పెద్ద డేటా బేస్ ఉంది. ఆ డేటాబేస్ ని చూసి విచారణ జరుపుతున్న పోలీసులే గుడ్లు తేలేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

జెఫ్రీ చేసిన దుర్మార్గపు పనుల జాబితాని సిద్ధం చేసిన వర్జిన్ ఐల్యాండ్స్ అధికారులు జెఫ్రీ ఎప్ స్టీన్ పైన, అతని ఎస్టేట్ పైన యుద్ధ ప్రాతిపదికన చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఆ దుర్మార్గుడిపైన కోర్టులో కేసు దాఖలయ్యింది. విచారణ వేగవంతంగా జరుగుతోంది. యూఎస్ పరిధిలో ఉన్న తన రెండు ప్రైవేట్ ద్వీపాలకూ రెండు దశాబ్దాలుగా జెఫ్రీ యువతులను తరలిస్తున్న విషయం విచారణలో వెలుగుచూసింది. పదులకొద్దీ సంఖ్యలో మైనర్లపై జెఫ్రీ అనేకమార్లు అత్యాచారం జరిపినట్టుగా విచారణలో వెల్లడయ్యింది.

కనీసం జాలి, దయ లేకుండా 11, 12 సంవత్సరాల బాలికలనుకూడా చెఫ్రీ తన ద్వీపాలకు ఎత్తుకెళ్లి వ్యభిచార కూపంలోకి దింపి వారిపై దారుణాలు చేసినట్టుగా అభియోగాలు నమోదయ్యాయి. దక్షిణ అమెరికాలో మోడలింగ్ ను కెరీర్ గా ఎంచుకోవాలనుకుని కలలుగనే అమ్మాయిలు ప్రధానంగా జెఫ్రీ టార్గెట్. మోడలింగ్ పేరుతో తప్పుడు వీసాలను సృష్టించి వందలమంది అమ్మాయిల్ని జెఫ్రీ యధేచ్చగా సరిహద్దులు దాటించిన వైనాన్ని చూసి అధికారులు ఆశ్చర్యపోతున్నారు. ఈ రాక్షసుడు ఇరవై ఏళ్లపాటు అతి గుంభనంగా ఈ సెక్స్ రాకెట్ ని నడిపిన తీరును గురించి తెలుసుకుంటే వాళ్లకే బాధ కలుగుతోంది.

అలా సరిహద్దులు దాటించిన అమ్మాయిలను వివిధ ప్రాంతాలకు తిప్పుతూ తన రెండు ప్రైవేట్ ద్వీపాల్లో మాత్రమే కాక వివిధ దేశాల్లోకూడా జెఫ్రీ చాలా పెద్ద వ్యభిచార నెట్వర్క్ ని ఏర్పాటు చేసుకున్నాడని విచారణలో తేలింది. 2018లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు చాలామంది అమ్మాయిల్ని తీసుకెళ్తున్న జెఫ్రీ ఎక్సైటింగ్ ప్రైవేట్ విమానాన్ని గుర్తించినట్టుగా కోర్టులో సాక్ష్యాలను ప్రవేశపెట్టారు. ఈ మధ్యకాలంలో జెఫ్రీ సాయంతో అనేకమంది బాలికలను లైగింకంగా హింసించిన ఒక అమెరికన్ కోటీశ్వరుడుకూడా పట్టుబడ్డ విషయం తెలిసిందే.

అలా జెఫ్రీ తీసుకొచ్చిన బాలికల్లో ఓ 15 సంవత్సరాల బాలిక అతను పెట్టిన టార్చర్ ని ధైర్యంగా భరించింది. ప్రాణంపోయినా ఆ నరక కూపంలో ఉండే ప్రశ్నేలేదనీ, వ్యభిచారం చేయడానికి ఒప్పుకోననీ ఎదురుతిరిగింది. జెఫ్రీ ఆ అమ్మాయిని బంధించి తీవ్రంగా హింసించాడు. చివరికి ఆ చిత్ర హింసల్ని తట్టుకోలేక ఎలాగోలా అక్కడ్నుంచి బయటపడి ధైర్యంగా ఈదుకుంటూ ఆ ద్వీపంనుంచి పారిపోయే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి అధికారుల కంట పడడంతో మొత్తం వ్యవహారమంతా బయటి ప్రపంచానికి తెలిసింది.

ఇన్ని అరాచకాలు చేసి పట్టుబడినా జెఫ్రీ చాలా ధైర్యంగానే వ్యవహారాన్ని నెట్టుకొచ్చాడు. తన ప్రైవేట్ ద్వీపాల్లోకి విచారణ జరిపేందుకు అధికారులను అనుమతించలేదు. వాళ్లు బలవంతంగా తనిఖీలు చేయాలని చూసినప్పుడు అనేక విధాలుగా వాళ్లను అడ్డుకున్నాడు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ అధికారులు అతని లిటిల్ జేమ్స్ ద్వీపంలోకి అడుగుపెట్టలేకపోయారు. చివరికి ఈ వ్యవహారమంతా బయటపడడంతో కోర్టు ఉత్తర్వులతో అధికారులు తనిఖీలు చేసి వందలాదిమంది బాధితులను బైటికి తీసుకొచ్చారు.

విచారణ జరుగుతున్న సమయంలోనే మాన్ హట్టన్ జైలు సెల్ లో ఆత్మహత్యకు పాల్పడిన జెఫ్రీ కఠిన శిక్షనుంచి తప్పించుకున్నాడు. 2002 నుంచి 2005 మధ్యలో న్యూయార్క్, ఫ్లోరిడా నగరాల్లో పలుసార్లు జెఫ్రీ అధికారులకు పట్టుబడినప్పుడు అత్యంత చాకచక్యంగా అసలేమాత్రం అనుమానం రాకుండా మ్యానేజ్ చేసి తప్పించుకున్నాడు. సరైన ఆధారాలు లేకపోవడంతో అప్పట్లో అధికారులుకూడా లైట్ తీసుకున్నారు.

వర్జిన్ ఐల్యాండ్ నుంచి బాధితులందరికీ పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందే విధంగా ప్రాసిక్యూటర్లు పకడ్బందీగా కేస్ ఫైల్ చేశారు. ఈ ఎస్టేట్ విలువ కనీసం 600 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఈ ఎస్టేట్ ని అమ్మడం ద్వారా వచ్చిన ధనాన్ని జెఫ్రీ వల్ల నష్టపోయిన, జీవితాల్ని కోల్పోయిన బాధితులకు సమానంగా అతనినుంచి స్వాధీనం చేసుకున్న డేటాబేస్ ఆధారంగా నష్టపరిహారంగా చెల్లించాలని ప్రాసిక్యూటర్లు న్యాయస్థానాన్ని కోరారు.

Next Story