ప్రపంచంలో టాప్ 10 సంపన్న మహిళలు వీరే..
By రాణి
ఉమెన్స్ డే స్పెషల్
మహిళల దినోత్సవం సందర్భంగా..ప్రపంచలోనే టాప్ 10 సంపన్న మహిళలెవరో మీకు తెలుసుకోవాలనుందా..అయితే మీరూ ఓ లుక్కేయండి.
అబిగైల్ జాన్సన్ : 1961 డిసెంబర్ 19న యూఎస్ లోని బోస్టన్ లో పుట్టిన ఈమె ప్రస్తుతం ఫిడెలిటీ ఇన్వెస్ట్ మెంట్స్ సీఈఓ గా వ్యవహరిస్తున్నారు. 2020కి ఈమె సంపద 15.7 బిలియన్లు.
అలిస్ వాల్టన్ : 1949 అక్టోబర్ 7వ తేదీన యూఎస్ లోని న్యూ పోర్ట్ లో జన్మించిన అలిస్ వాల్టన్ వాల్ మార్ట్ వ్యవస్థాపకుడు సామ్ వాల్టన్ కుమార్తె. ప్రస్తుతం క్రిస్టల్ బ్రిడ్జెస్ మ్యూజియమ్ ఆఫ్ అమెరికన్ ఆర్ట్ ను రన్ చేస్తున్న అలిస్ వాల్టన్ సంపద 49.8 బిలియన్లు.
ఫ్రాంకోయిస్ బెటెన్ కోర్ట్ మేయెర్స్ : 1953 జులై 10న ఫ్రాన్స్ లోని న్యూఇల్లీ సర్ సైన్ లో జన్మించిన ఫ్రాంకోయిస్ L'Oreal సంస్థను నడిపిస్తున్నారు. ప్రస్తుతం ఈమె సంపద $52.5 బిలియన్లు.
గినా రిన్హార్ట్ : 1954, ఫిబ్రవరి 9వ తేదీన ఆస్ర్టేలియాలోని పెర్త్ లో జన్మించిన గినా రిన్హార్ట్ సంపద $14.7 బిలియన్లు. ఆమె Hancock Prospecting కంపెనీని నడిపిస్తున్నారు.
ఇరిస్ ఫోన్ట్ బోనా : 1942లో చిలీలోని యాంటో ఫాగస్టాలో జన్మించిన ఇరిస్ సంపద $13.2 బిలియన్ డాలర్లు. చిలీలోనే బిలీనియర్ గా పేరు గడించారు. అమెరికాలో 5వ సంపన్నురాలిగా నిలిచారు ఇరిస్. Antofogasta Plc కంపెనీని రన్ చేస్తున్నారు.
జాక్వెలిన్ మార్స్ : 1939 అక్టోబర్ 10వ తేదీన యూకేలో పుట్టిన జాక్వెలిన్ సంపద $29.9 బిలియన్లు. మార్స్ కంపెనీ వ్యవస్థాపకుడు ఫ్రాంక్ సి. మార్స్ మనుమరాలు. ప్రస్తుతం ఫ్రాంక్ సి. స్థాపించిన Mars కంపెనీకి సీఈఓ గా ఉన్నారు.
క్వాంగ్ సియు హింగ్ : క్వాంగ్ ప్రపంచంలోనే ఏడవ సంపన్నురాలిగా నిలిచింది. Sun Hung Kai Properties కంపెనీని నడిపిస్తున్న క్వాంగ్ సంపద $13.2 బిలియన్లు.
లారెన్స్ పావెల్ : అమెరికా వ్యాపారవేత్త అయిన లారెన్స్ పావెల్ 1963 నవంబర్ 6వ తేదీన న్యూ జెర్సీలోని వెస్ట్ మిల్ ఫోర్డ్ లో జన్మించారు. ప్రపంచంలో 8వ సంపన్నురాలిగా నిలిచిన పావెల్ Emerson Collective కంపెనీని నడిపిస్తున్నారు.
సుసానే క్లాటన్ : 1962, ఏప్రిల్ 28వ తేదీన జర్మనీలో పుట్టిన సుసానే సంపద ఫిబ్రవరికి $21 బిలియన్లు. మహిళా సంపన్నురాళ్లలో టాప్ 9లో నిలిచిన ఈమె..ప్రపంచంలో 46వ సంపన్నురాలు. ప్రస్తుతం BMW కంపెనీకి పనిచేస్తున్నారు.
యాంగ్ హుయాన్ : 1981, జులై 20న చైనాలోని ఫోషన్, షుండే జిల్లాలో పుట్టిన యాంగ్ హుయాన్ Country Garden Holdings లో షేర్ హోల్డర్ గా ఉన్నారు. ప్రస్తుతం యాంగ్ సంపద $24.7 బిలియన్లు.