హెప‌టైటీస్ య‌మ‌డేంజ‌ర్‌..ఆందోళ‌న క‌లిగిస్తున్న వ్యాధి

By సుభాష్  Published on  28 July 2020 4:17 AM GMT
హెప‌టైటీస్ య‌మ‌డేంజ‌ర్‌..ఆందోళ‌న క‌లిగిస్తున్న వ్యాధి

ముఖ్యాంశాలు

  • హెపటైటీస్‌తో అప్రమత్తం

  • తీవ్రమైతే లివర్‌ మార్పిడి తప్పనిసరి

  • అవగాహనలేమితో అనారోగ్యంపాలు

  • నేడు ప్రపంచ హెపటైటిస్‌ వ్యాధి నివారణ దినోత్సవం

ప్ర‌స్తుతం కాలంలో ఉన్న ప‌రిస్థితులు, ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధానాలు, ఉద్యోగంలో ఒత్తిళ్లు, మానసిక ఒత్తిళ్లు, నిద్ర‌లేనిత‌నం త‌దిత‌ర కార‌ణాల‌తో మ‌నిషికి ఎన్నో వ్యాధులు ద‌రి చేరుతున్నాయి. ఇందులో హెప‌టైటీస్ వ్యాధి. ఇది చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన‌ది. ఇది శ‌రీరంలోని కాలేయం (లివ‌ర్‌)పై తీవ్ర ప్ర‌భావం చూపుతుంది. ఏ,బి,సి,డి,ఇలు వెలుగు చూసిన ఈ వ్యాధిలో హెపటైటీస్ వ్యాధి చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన‌ద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి తీవ్ర‌త సిర్రోలిక్ ద‌శ‌కు చేరుక‌కుని ఏకంగా కాలేయం పూర్తిగా దెబ్బ‌తింటుంది. ఈ ద‌శ‌లోకాలేయం మార్పిడి చేయాల్సి వ‌స్తుంది. అందుకు వ్యాధి బారిన‌ప‌డ‌కుండా ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే ఈ వ్యాధిపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌తియేటా జూలై 28న హెప‌టైటి్ నివార‌ణ దినోత్స‌వాన్ని జ‌రుపుకొంటున్నారు.

ప్ర‌తియేటా పెరుగుతున్న వ్యాధిగ్ర‌స్థులు

దేశ వ్యాప్తంగా ప్ర‌తియేటా హెప‌టైటీస్ వ్యాధిగ్రస్థులు పెరిగిపోతున్నారు. ప‌లు ప్రాంతాల్లో అప‌రిశుభ్ర‌మైన వాతావ‌రణం, క‌లుషిత‌మైన నీటి కార‌ణంగా ఈ వ్యాధి బారిన ప‌డే వారి సంఖ్య పెరిగిపోతోంది. అధికంగా మురికివాడ‌ల్లోనూ ఈ హెప‌టైటీస్ -బి న‌మోద‌వుతుంది. ఈ వ్యాధి పై అవ‌గాహ‌న క‌ల్పించి నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిన అవ‌స‌రం వైద్య ఆరోగ్య‌శాఖ‌పై ఉంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ప్రాథ‌మిక ద‌శ‌లోనే వ్యాధిని గురించి చికిత్స అందించాలి

ఈ హెప‌టైటీస్ వ్యాధిని ప్రాథ‌మిక ద‌శ‌లో ఉండ‌గానే గురించి చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి బాధితుడిని కాపాడ‌వ‌చ్చ‌ని వైద్యులు పేర్కొన్నారు.ఈ వ్యాధి రాకుండా ముందు జాగ్ర‌త్త‌గా వ్యాధి నిరోధ‌క టీకా కూడా అందుబాటులో ఉంది. దీని ధ‌ర కూడా మార్కెట్లో అధిక ధ‌ర ఉండ‌టంతో పేద‌ల‌కు ఇబ్బందిగా మారింద‌నే చెప్పాలి.దీనిని దృష్టి ఉంచుకుని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో ఈ టీకా అందుబాటులో ఉంచాల్సిన అవ‌స‌రం ఉంది.

కాలేయ వ్యాధి ఎక్కువ‌గా ఎవ‌రికి వ‌స్తుంది

ఈ వ్యాధి అధికంగా మ‌ద్యం సేవించే వారికి వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. శ‌రీరంలో చేరే మ‌ద్యాన్ని విస‌ర్జించే క్ర‌మంలో కాలేయం ఎక్కువ‌గా శ్ర‌మ‌కు గుర‌వుతుంది. కాలేయం సామర్థ్యానికి మించి మ‌ద్యం సేవించిన‌ట్ల‌యితే కాలేయ మెల్ల‌మెల్ల‌గా దెబ్బ‌తింటుంది. ఫ‌లితంగా ఆల్క‌హాలిక్ ఫ్యాటీలివ‌ర్ డిసీజ్‌, ఆల్క‌హాలిక్ హెప‌టైటీస్ ఆల్క‌హాలిక్ సిర్రోసిస్ వ్యాధులు ద‌రిచేరుతాయి. ఆల్క‌హాలిక్ ఫ్యాటి లివ‌ర్ డిసీజ్‌లో కాలేయం కణాల్లో కొవ్వు పేరుకుపోతుంది. అలాగే కాలేయం ప‌నితీరు స‌క్ర‌మంగా ఉన్నా.. ఎంజైమ్ విడుద‌ల‌లో హెచ్చు త‌గ్గులు చోటు చేసుకుంటాయి.ఈ ప‌రిస్థితిని మ‌ద్యం మానేసి స‌రిదిద్దుకోవాలి. అతిగా మ‌ద్యం సేవించే వారి కాలేయం వాపున‌కు గురై గ‌ట్టిగా త‌యార‌వుతుంది. దీనినే ఆల్క‌హాలిక్ హెప‌టైటీస్ అంటారు.

ఈ వ్యాధితో కాలేయం పనితీరు క్రమంగా అదుపుతప్పుతుంది. వ్యాధితీవ్రత పెరిగితే కాలేయం విఫలమవుతుంది. హెపటైటిస్‌ బి, హెపటైటిస్‌ సి, వైరస్‌ల వల్ల కాలేయం కేన్సర్‌కు దారి తీసే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

వ్యాధి ల‌క్ష‌ణాలు:

  • కామెర్లు, ర‌క్తం వాంతులు,
  • విరోచ‌నాలు, అల‌స‌ట ఎక్కువ‌గా ఉండ‌టం
  • ఆక‌లి లేక‌పోవ‌డం
  • క‌డుపు నొప్పి
  • క్ర‌మ క్ర‌మంగా బ‌రువు త‌గ్గిపోవ‌డం
  • కండ‌రాలు, కీళ్ల నొప్పులు అధికంగా ఉండ‌టం
  • జ్వ‌రం
  • కాళ్లు, పొట్టవాపు
  • చ‌ర్మం, క‌ళ్లు ప‌చ్చ‌గా మార‌డం
  • న‌ల్ల‌రంగులో విరోచ‌నాలు
  • ప‌గ‌లు నిద్ర‌, రాత్రుల్లో మెల‌కువ‌గా ఉండ‌ట‌

చికిత్స

  • వ్యాధి నివార‌ణ‌కు శాశ్వ‌త చికిత్స లేదు
  • వ్యాధిగ్ర‌స్థుడు ప్ర‌తియేటా వైద్య ప‌ర‌క్ష‌లు చేయించుకోవాలి
  • హెప‌టైటీస్ టీకా వేయించుకోవాలి.
  • వారానికి ఒక ఇంట్ర‌ఫిరాన్ ఇంజ‌క్ష‌న్ వేసుకోవాలి.
  • అతి ఖ‌ర్చుతో కూడిన‌ది కార‌ణంగా మాత్ర‌ల ద్వారా నియంత్ర‌ణ చేయ‌వ‌చ్చు.

అప్ర‌మ‌త్తంగా ఉండాలి

హెప‌టైటీస్ వ్యాధులు ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి. నిర్ల‌క్ష్యం చేస్తే ప్రాణాల‌మీద‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. వ్యాధిరాక‌ముందే టీకా వ్యాధి వ‌చ్చే అవ‌కాశం ఉండ‌దు. ఒక వేళ వ్యాధి ముదిరిన‌ట్ల‌యితే కాలేయం మార్పిడే శ‌ర‌ణ్యం. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌లో కూడా చిన్నారుల‌కు ఈ వ్యాక్సిన్ వేస్తున్నారు. అలాగే ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా అందుబాటులో ఉంటుంది.

Next Story