టాలీవుడ్ లేటెస్ట్ సున్సేష‌న్ విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్లాప్‌ టాక్‌ను రాబట్టుకుంది. దీంతో వారం రోజులు గ‌డ‌వ‌క‌ముందే ఈ సినిమాను దాదాపు అన్ని థియేటర్ల లో నుండి తీసివేశారు. దీన్ని బ‌ట్టి ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగిసినట్లే అని చెప్పాలి. అయితే.. ఈ సినిమా ఫుల్ రన్‌లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 9.09 కోట్ల షేర్‌ను మాత్రమే రాబట్టి.. నిర్మాత కేఎస్ రామారావును నిండా ముంచింది.

గత ఏడాది డియర్ కామ్రేడ్ సినిమాతో డిజాస్టర్‌ను మూట‌గ‌ట్టుకున్న‌ విజయ్.. తాజాగా ఫేమస్ లవర్ తో అంతకు మించిన డిజాస్టర్‌ను ఖాతాలో వేసుకున్నాడు. డియర్ కామ్రేడ్ ఓపెనింగ్స్ అయినా వ‌చ్చాయి.. కానీ, వ‌ర‌ల్డ్‌ ఫేమస్ లవర్‌ మాత్రం ఫుల్ రన్‌లో సింగిల్ డిజిట్ షేర్‌కు పరిమితమై.. విజయ్ మార్కెట్ ను ఘోరంగా దెబ్బతీసింది. ఇదిలావుంటే.. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో నటిస్తున్నాడు.

ఫేమస్ లవర్ క్లోజింగ్ కలెక్షన్స్ :

నైజాం – 3.60 కోట్లు
సీడెడ్ – 0.70 కోట్లు
ఉత్తరాంద్ర – 0.75 కోట్లు
గుంటూరు – 0.62 కోట్లు
తూర్పు గోదావరి – 0.50 కోట్లు
పశ్చిమ గోదావరి – 0.35 కోట్లు ‘
కృష్ణా – 0.50 కోట్లు
నెల్లూరు – 0.27 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం షేర్ – 7.29 కోట్లు
కర్ణాటక +రెస్ట్ ఆఫ్ ఇండియా – 0.75 కోట్లు
ఓవర్సీస్ – 1.05 కోట్లు
మొత్తం ప్రపంచ వ్యాప్తంగా షేర్ – 9.09 కోట్లు

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.