World Cup-2023: రోహిత్‌ శర్మ సాధించిన రికార్డులివే..

హిట్‌మ్యాన్‌ పలు అరుదైన రికార్డులు తన పేరిట నమోదు చేసుకున్నాడు.

By Srikanth Gundamalla  Published on  15 Oct 2023 10:25 AM IST
World cup-2023, Team india, captain rohit sharma, records,

World Cup-2023: రోహిత్‌ శర్మ సాధించిన రికార్డులివే..

భారత్‌ వేదికగా వన్డే వరల్డ్‌ కప్‌-2023 టోర్నీ కొనసాగుతోంది. ఈ వరల్డ్‌ కప్‌లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. తాజాగా అహ్మదాబాద్‌ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన దాయాది దేశం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. బౌలర్లు రాణించడంతో తక్కువ స్కోర్‌కే ఆలౌట్‌ అయ్యింది పాక్. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ టీ20 మాదిరే ఆడి చిత్తు చేసింది. ముఖ్యంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మెరుపు షాట్స్‌తో అభిమానుల్లో పూనకాలు తెప్పించాడు. ఈ మ్యాచ్‌లోనే కాదు.. రోహిత్‌ శర్మ అంతకుముందు అప్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అప్ఘాన్‌పై సెంచరీ చేశాడు. ఇక పాక్‌ మ్యాచ్‌లో అయితే హిట్‌మ్యాన్‌ 63 బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్స్‌లతో 86 పరుగులు చేశాడు. దాంతో.. హిట్‌మ్యాన్‌ పలు అరుదైన రికార్డులు తన పేరిట నమోదు చేసుకున్నాడు.

1. వన్డే వరల్డ్‌ కప్‌ చరిత్రలో విజయవంతమైన రన్‌ చేజింగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్‌ నిలిచాడు. రోహిత్‌ శర్మ ఇప్పటి వరకు వరల్డ్‌ కప్‌లో 9 విజయవంతమైన లక్ష్య చేదనలో 586 పరుగులు చేశాడు. అంతకు ముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (519) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో పాంటింగ్‌ రికార్డును హిట్‌మ్యాన్ బ్రేక్‌ చేశాడు.

2. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ ఆరు సిక్సర్లతో చెలరేగిన విషయం తెలిసిందే. దాంతో.. వన్డే క్రికెట్‌లో రోహిత్‌ శర్మ 300 సిక్స్‌లు బాదిన మైలురాయిని అందుకున్నారు. అంతర్జాతీయ వన్డేల్లో 300 సిక్స్‌ల మార్క్‌ను అందుకున్న మూడో క్రికెటర్‌గా రోహిత్‌ శర్మ నిలిచాడు. కాగా.. 300 సిక్సర్లు బాదిన జాబితాలో పాకిస్తాన్‌ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (351) తొలి స్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో క్రిస్‌ గేల్ (331) ఉన్నారు. తాజాగా 303 సిక్సర్లతో రోహిత్‌ మూడో స్థానంలో నిలబడ్డాడు. అయితే.. భారత్‌ నుంచి మాత్రం ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌ హిట్‌మ్యాన్‌ కావడం విశేషం.

3. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 300 సిక్సులు కొట్టిన మొదటి క్రికెటర్‌గా రోహిత్‌ చరిత్రను సృష్టించాడు.

5. వన్డే వరల్డ్‌ కప్‌ టోర్నీలో పాక్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన భారత కెప్టెన్‌గానూ రోహిత్‌ శర్మ రికార్డు సృష్టించాడు. రోహిత్‌ ఈ మ్యాచ్‌లో 86 పరుగులు చేసిన విషయం అందరికీ తెలిసిందే. దాంతో.. పాక్‌పై అత్యధిక స్కోర్‌ చేసిన టీమిండియా కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు.

Next Story