శ్రీలంకపై కివీస్ గెలుపు.. సెమీస్‌ రేస్‌లో పాక్‌ పరిస్థితేంటి..?

వన్డే వరల్డ్‌ కప్‌-2023 టోర్నీలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ దుమ్ము దులిపింది.

By Srikanth Gundamalla  Published on  9 Nov 2023 9:15 PM IST
world cup-2023, new zealand,  sri lanka,

శ్రీలంకపై కివీస్ గెలుపు.. సెమీస్‌ రేస్‌లో పాక్‌ పరిస్థితేంటి..?

వన్డే వరల్డ్‌ కప్‌-2023 టోర్నీలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ దుమ్ము దులిపింది. శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో గెలిచింది. చిన్నస్వామి వేదికగా శ్రీలంకతో జరిగిన ముఖ్యమైన మ్యాచ్‌లో కివీస్‌ విజయం సాధించింది. అయితే.. పాయింట్స్‌ టేబుల్‌లో 4వ స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌ సెమీస్‌ చేరుకోవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఉండింది. శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసి 172 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ టార్గెట్‌న కేవలం 23.2 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో పాయింట్లలో పట్టిలో నాలుగో స్థానానికి చేరి.. సెమీస్‌పై ఆశలను సజీవంగా పెట్టుకుంది.

అయితే.. అఫ్గానిస్తాన్‌- దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ల ఫలితాల తర్వాత సెమీస్‌కు వచ్చే నాలుగో జట్టు ఏదో అధికారికంగా తేలనుంది. ఇప్పటికే ఇండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరాయి. 9 మ్యాచ్‌లు ఆడిన న్యూజిలాండ్‌ ఐదింటిలో గెలిచి 0.743 రన్‌రేట్‌తో నాలుగో స్థానంలో ఉంది. ఇక పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లో చెరో 8 మ్యాచ్‌లు ఆడి నాలుగింట్లలో గెలిచాయి. ఇక 9వ మ్యాచ్‌లో పోరాడి సెమీస్‌ కోసం ప్రయత్నాలు చేయనున్నాయి. ఈ క్రమంలో రన్‌ రేట్‌ ఆధారంగా సెమీస్‌కు చేరే టీమ్‌ ఖరారు కానుందని చెప్పాలి. పాకిస్థాన్‌ భారీ పరుగుల తేడాతో గెలిస్తేనే సెమీస్‌ అవకాశాలు ఉంటాయి. ఇక అప్ఘాన్‌ 400కు పైగా పరుగుల తేడాతో గెలిస్తే సెమీస్‌ రేసులో ఉంటుంది. ఇది అసాధ్యం కాబట్టి దాదాపుగా అప్ఘాన్‌ రేసు నుంచి తప్పుకున్నట్లే అని చెప్పాలి. ఇక పాకిస్తాన్ కూడా భారీ రన్స్‌ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప పాక్‌ సెమీస్‌ చేరే అవకాశాలు లేవు. ఏదైతే ఏంటి.. న్యూజిలాండ్‌ ఇంపార్టెంట్‌ మ్యాచ్‌లో అదరగొట్టి సెమీస్‌ అవకాశాలను నిలుపుకుంది.

సచిన్‌ రికార్డును బ్రేక్ చేసిన రచిన్ రవీంద్ర

న్యూజిలాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ రచిన్‌ రవీంద్ర అరుదైన ఘనత సాధించాడు. వన్డే వరల్డ్‌కప్‌ సింగిల్‌ ఎడిషన్‌లో 25 ఏళ్ల వయస్సులోపు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రవీంద్ర చరిత్ర సృష్టించాడు. ఈ మెగా టోర్నీలో రవీంద్ర ఇప్పటివరకు 9 ఇన్నింగ్స్‌లలో 565 పరుగులు చేశాడు. కాగా ఇంతకుముందు ఈ అరుదైన రికార్డు క్రికెట్‌ గాడ్‌ సచిన్ టెండూల్కర్‌ పేరిట ఉండేది. 1996 వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో సచిన్‌ 523 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో సచిన్‌ 27 ఏళ్ల రికార్డును రచిన్‌ బ్రేక్‌ చేశాడు. ఇక ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రవీంద్రనే ఉన్నాడు. ఈ టోర్నీలో రచిన్ ఖాతాలో 3 సెంచరీలు, 2 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

Next Story