World Cup-2023: టీమిండియా జోరు కొనసాగిస్తుందన్న ద్రవిడ్

వన్డే వరల్డ్‌ కప్‌లో కూడా టీమిండియా జోరు కొనసాగిస్తుందని హెడ్‌ కోచ్‌ ద్రవిడ్ చెప్పాడు.

By Srikanth Gundamalla  Published on  29 Sept 2023 1:45 PM IST
World cup-2023, India, head coach, dravid,

 World Cup-2023: టీమిండియా జోరు కొనసాగిస్తుందన్న ద్రవిడ్ 

వన్డే వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అదికూడా భారత్‌ వేదికగా ఈ టోర్నీ జరుగుతుండటం క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రతి మ్యాచ్‌ను లైవ్‌లో చూడొచ్చని భావిస్తున్నారు. అయితే.. భారత్‌ వేదికగా పుష్కర కాలం తర్వాత ఈ మెగా టోర్నీ జరుగుతోంది. దాంతో.. వరల్డ్‌ కప్‌లో ఈసారి అదరగొట్టాలని టీమిండియా భావిస్తోంది. టీమిండియా ఫామ్‌ను చూస్తే కచ్చితంగా వరల్డ్‌ చాంపియన్స్‌గా నిలుస్తారనే అంటున్నారు క్రీడా విశ్లేషుకులు. ఇంతకు ముందు జరిగిన ఆసియా కప్, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనను ఇచ్చారు. ఇప్పుడు అదే జోరుని కొనసాగిస్తారని అంటున్నారు. అటు ఆసియా కప్‌ గెలవగా.. ఆస్ట్రేలియా సిరీస్‌ను సొంతం చేసుకుంది టీమిండియా.

ప్రస్తుతం భారత జట్టు వరల్డ్‌ ప్‌ ప్రిపరేషన్స్‌ గురించి హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. వరల్డ్‌ కప్‌కు ముందు టీమిండియా సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. ఇదే జోరుని టీమ్‌ వరల్డ్‌ కప్‌లో కూడా కొనసాగిస్తుందని చెప్పుకొచ్చాడు. మెగా టోర్నీకి ముందుకు ప్రతీ ఒక్క ప్లేయర్‌ ఫామ్‌లో ఉండటం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. జస్ప్రీత్‌ బుమ్రా, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ సూపర్బ్‌ కమ్‌బ్యాక్‌ ఇచ్చారని తెలిపాడు ద్రవిడ్. ఆసీస్‌ వన్డే సిరీస్‌లో జస్ప్రీత్‌ రెండు మ్యాచ్‌లు ఆడి.. 10 ఓవర్ల కోటాను పూర్తి చేశాడని చెప్పాడు. దాంతో.. అతడు బౌలింగ్ బాగా చేయగలడని.. ఎప్పటిలానే వికెట్లు తీసే ఎనర్జీతో ఉన్నాడని ద్రవిడ్ చెప్పాడు.

ఇక సిరాజ్‌ కూడా కొద్దిరోజులు మడమ నొప్పితో బాధపడ్డాడని చెప్పాడు. ఆ తర్వాత ఫిట్నెస్‌ సాధించి బౌలింగ్‌ చేస్తున్నాడని ద్రవిడ్ చెప్పాడు. అశ్విన్ కూడా అద్భుతమైన స్పిన్‌ చేస్తున్నాడని అన్నారు. మరోవైపు కేఎల్ రాహుల్‌ బ్యాటింగ్ తో పాటు వికెట్‌ కీపింగ్‌ 50 ఓవర్ల పాటు చేస్తున్నాడని చెప్పాడు. శ్రేయస్‌ అయ్యర్ సెంచరీ గురించి ప్రస్తావించిన ద్రవిడ్.. అతడి ఆటతీరు ఎంతో బాగుందని ప్రశంసించాడు. వరల్డ్‌కప్‌కు ముందు వీరంతా రిథమ్‌ తిరిగి పొందడానికి మంచి సమయం దొరికిందని ద్రవిడ్ అన్నాడు. అంతేకాకుండా టీమిండియాకు మంచి ప్రాక్టీస్‌కూడా దక్కిందని చెప్పారు. అంతేకాదు.. వరల్డ్‌కప్‌కు ముందు కొందరు ఆటగాళ్లు వైరల్ ఫీవర్‌తో బాధపడ్డారని.. ప్రస్తుతం కోలుకున్నారని ద్రవిడ్ చెప్పాడు. కాగా.. టీమిండియా రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది. సెప్టెంబర్ 30న ఇంగ్లండ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది భారత్.

Next Story