వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ వేళ అదిరిపోయే షో ప్లాన్‌ చేసిన బీసీసీఐ

వరల్డ్‌ కప్‌-2023 ఫైనల్‌ మ్యాచ్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

By Srikanth Gundamalla  Published on  18 Nov 2023 2:12 PM IST
world cup-2023, india, australia, final match, bcci,

 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ వేళ అదిరిపోయే షో ప్లాన్‌ చేసిన బీసీసీఐ

వన్డే వరల్డ్‌ కప్‌-2023 ఫైనల్‌ మ్యాచ్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్‌, ఆస్ట్రేలియా వరల్డ్‌ కప్‌ కోసం తలపడుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఒక్క ఓటమి లేని టీమ్‌ భారత్‌ ఎలాగైనా కప్‌ గెలవాలని భావిస్తోంది. మరోవైపు 8వ సారి ఫైనల్‌కు చేరిన ఆస్ట్రేలియా కూడా కప్‌ను కొట్టాలని చూస్తోంది. ఈ హైఓల్టేజ్‌ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో మ్యాచ్‌కు ముందు.. మ్యాచ్‌ జరిగే క్రమంలో వచ్చే బ్రేక్‌ సమయంలో సూపర్‌ షోకు బీసీసీఐ ఏర్పాట్లు చేసింది.

ఐసీసీ వరల్డ్ కప్ -2023 ఫైనల్ మ్యాచ్ జరగనున్న వేళ బీసీసీఐ క్రికెట్ లవర్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో స్టన్నింగ్ షో ప్లాన్ చేసినట్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది. మ్యాచ్ కు ముందుకు అంటే మధ్యాహ్నం 1.35 గంటల నుంచి 1.50 గంటల వరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన సూర్య కిరణ్ టీమ్ ఎయిర్ షో ఉంటుందని తెలిపింది. ఇప్పటికే ఈ షోకు సంబంధించి ఎయిర్‌ఫోర్స్‌ రిహారల్స్‌ చేసిన సంగతి తెలిసిందే.

వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో కూడా మరో షో ఉంటుందని చెప్పింది బీసీసీఐ. ఈ సమయంలో ఆదిత్య గద్వి పెర్ఫామెన్స్ ఉంటుందని వెల్లడించింది. ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో ప్రీతం, జోనితా గాంధీ, నకష్ అజీజ్, అమిత్ మిశ్రా, అకాశ సింగ్, తుషార్ జోషిల పెర్ఫామెన్స్ ఉంటుందని తెలిపింది. సెకండ్ ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో లేసర్, లైట్ షో ఉంటుందని అనౌన్స్ చేసింది బీసీసీఐ. ఆటగాళ్లు ఆడుతున్న సమయంలోనే కాదు.. బ్రేక్‌ సమయంలో కూడా ప్రేక్షకులను అలరించబోతుంది బీసీసీఐ. దాంతో.. ఈ మ్యాచ్‌ మరింత ఆసక్తికరంగా మారింది.

ఈ వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ , ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్‌ మార్లెస్‌ స్టేడియానికి వచ్చి వీక్షించనున్నారు. దాంతో.. భద్రతా ఏర్పాట్లను కూడా భారీ చేస్తున్నారు అధికారులు. మరోవైపు భారత్‌ ఆటగాళ్లు ఫుల్‌ ఫామ్‌లో ఉండటంతో.. కప్పు మనదే అంటున్నారు టీమిండియా ఫ్యాన్స్‌. ఈ టోర్నీలో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో కూడా ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. భారత గడ్డపై జరిగే టోర్నీలో టీమిండియాను ఓడించడం ఎవరి తరం కాదనీ.. కప్పు భారత్‌దే అంటున్నారు. ఎలాగైనా గెలవాలంటూ కొందరు ప్రార్థనలు చేస్తున్నారు.

Next Story