IND Vs ENG: భారత్‌కు సవాల్‌గా మారిన తుది జట్టు ఎంపిక
లక్నో వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ జరగనుంది. తుది జట్టు ఎంపిక భారత్‌కు సవాల్‌గా మారింది.
By Srikanth Gundamalla Published on 28 Oct 2023 11:45 AM GMTIND Vs ENG: భారత్‌కు సవాల్‌గా మారిన తుది జట్టు ఎంపిక
వన్డే వరల్డ్ కప్-2023 టోర్నీ భారత్ వేదికగా జరుగుతోంది. ఈ టోర్నీలో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఆడిన ఐదుకి ఐదు మ్యాచ్‌లో రోహిత్ సేన ఘన విజయాలను అందుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. అయితే.. టోర్నీలో ఇప్పటి వరకు ఒక్క ఓటమిని కూడా చూడని ఏకైక జట్టు భారత్. ఈ క్రమంలోనే టీమిండియా మరో పోరుకు సిద్దమైంది. ఆదివారం డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది.
లక్నో వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ జరగనుంది. అయితే కొద్దిరోజుల ముందు గాయపడిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ కూడా ఆడడం లేదు. హార్దిక్ పాండ్యా లేకపోవడంతో టీమిండియా తుది జట్టులో సమతుల్యం దెబ్బతింటోంది. దీంతో తుది జట్టు ఎంపిక భారత్‌కు సవాల్‌గా మారింది. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో తుది జట్టులోకి సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమీని తీసుకున్నారు. అయితే ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్ లక్నో వేదికగా జరగనుంది. ఈ పిచ్‌పై బంతి టర్నయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఎక్స్‌ట్రా స్పిన్నర్ అవసరం పడొచ్చు. గతంలో ఇక్కడ జరిగిన మ్యాచ్‌ల్లో స్పిన్నర్లు మంచి ప్రభావం చూపారు. దీంతో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి. అయితే అశ్విన్‌ను ఎవరి ప్లేసులో జట్టులోకి తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
గత మ్యాచ్‌లో షమీ 5 వికెట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో.. అతడిని ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పించే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఇక సూర్యకుమార్‌ను కూడా తప్పించే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. సూర్యను తప్పిస్తే జట్టు బ్యాటింగ్ యూనిట్ సామర్థ్యం తగ్గుతుందని భావిసతున్నారు. అయితే.. సిరాజ్ వికెట్లు తీస్తున్నప్పటికీ పరుగులు కూడా కాస్త ఎక్కువే సమర్పించుకుంటున్నాడు. దాంతో.. సిరాజ్ స్థానంలో అశ్విన్‌ను ఆడించే అవకాశాలు లేకపోలేదు. కానీ.. అలా చేస్తే ఇద్దరు పేసర్లతోనే టీమిండియా ఆడాల్సి వస్తుంది. దాంతో.. ఎవరిని తీసుకోవాలనే దానిపై భారత్‌కు కాస్త తలనొప్పిగానే మారిందని చెప్పాలి.
ఏది ఏమైనా మ్యాచ్‌కు ముందు పిచ్‌ను పరిశీలించాక కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తుదిజట్టుపై నిర్ణయం తీసుకుంటారు. మొత్తంగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్.. వన్ డౌన్‌లో విరాట్ కోహ్లీ, నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ ఆడనున్నారు. ఆ తర్వాత ఆరో స్థానంలో సూర్యకుమార్, ఏడో స్థానంలో జడేజా బ్యాటింగ్ చేస్తారు. ప్రధాన స్పిన్నర్‌గా కుల్దీప్ ఉంటే.. ఎక్స్‌ట్రా స్పిన్నర్ కావాలనుకుంటే అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలా చేస్తే సిరాజ్, షమీలలో ఒకరికే తుది జట్టులో చోటు దక్కే చాన్సులు ఉన్నాయి. ఇక పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా స్థానానికి ఢోకా లేదు.