టీమిండియా చాలా హాట్‌గా ఉంది.. రోహిత్ అద్భుతమైన టీమ్ లీడర్ : పాక్ దిగ్గజం ట్వీట్ వైరల్
2023 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ ఇండియా అద్భుత ప్రదర్శన చేస్తోంది.
By Medi Samrat Published on 30 Oct 2023 10:12 AM GMT2023 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ ఇండియా అద్భుత ప్రదర్శన చేస్తోంది. బ్యాటింగ్ నుంచి బౌలింగ్ వరకు జట్టు చాలా పటిష్టంగా కనిపిస్తోంది. ప్రపంచకప్-2023లో ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు విజయం సాధించింది. టోర్నికి ముందు నుంచి భారత జట్టు ఈసారి ప్రపంచకప్‌కు బలమైన పోటీదారుగా పరిగణించబడుతోంది. ఇందుకు సంబంధించి పలువురు క్రికెట్ నిపుణులు, మాజీ క్రికెటర్లు కూడా ఇప్పటికే తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇప్పుడు పాకిస్థాన్ జట్టు మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ కూడా టీమిండియాపై చేసిన ట్వీట్.. సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది.
అక్టోబర్ 29న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 100 పరుగుల తేడాతో ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను ఓడించింది భారత విజయంపై వకార్ యూనిస్ ట్వీట్ చేస్తూ.. “బ్యాట్స్‌మెన్ మీకు మ్యాచ్‌లు గెలిపిస్తారు.. బౌలర్లు మీకు ట్రోఫీలు గెలిపిస్తారు. భారత్ జట్టు చాలా హాట్‌గా ఉంది. రోహిత్ శర్మ అద్భుతమైన టీమ్ లీడర్ అని ప్రశంసించాడు. ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీని అందరూ మెచ్చుకుంటున్నారు. చాలా మంది మాజీ క్రికెటర్లు రోహిత్‌ను అద్భుతమైన కెప్టెన్‌గా అభివర్ణించారని పేర్కొన్నాడు.
Batters Win you matches but bowlers Win you Trophies. India too Hot to handle. Rohit Sharma excellent Leader. #CompletePackage #CricketWorldCup23 pic.twitter.com/M8dl5FQUEO
— Waqar Younis (@waqyounis99) October 29, 2023
ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలోనే జట్టు 3 వికెట్లు పడిన సమయంలో రోహిత్ ఓపికగా బ్యాటింగ్ చేసి స్కోరు 200 దాటడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి డకౌట్ అయినా రోహిత్ శర్మ మరోసారి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ 101 బంతుల్లో 87 పరుగులతో ఉపయోగకరమైన ఇన్నింగ్సు ఆడాడు. రోహిత్ ఈ ఇన్నింగ్సుకు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' కూడా ఎంపికయ్యాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 229 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత జట్టు ప్రమాదకరమైన బౌలింగ్ ముందు ఇంగ్లండ్ కేవలం 129 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో, మహ్మద్ షమీ, టీమిండియా బౌలింగ్‌లో తన పేరు మీద 4 వికెట్లు పడగొట్టాడు.