మరోసారి గ్రౌండ్ లో జార్విస్ సందడి

జార్వో 69.. డేనియల్ జార్విస్ ఎన్నో ప్రాంక్ లు చేస్తూ ఉంటాడు.

By Medi Samrat  Published on  8 Oct 2023 8:30 PM IST
మరోసారి గ్రౌండ్ లో జార్విస్ సందడి

జార్వో 69.. డేనియల్ జార్విస్ ఎన్నో ప్రాంక్ లు చేస్తూ ఉంటాడు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ పిచ్‌లపై ఊహించని విధంగా దూసుకుని రావడం మనకు తెలిసిందే. ఆదివారం చెన్నైలో భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య క్రికెట్ ప్రపంచ కప్ 2023 మ్యాచ్‌లో కూడా కనిపించాడు. ఫీల్డ్ లొకాలికి వచ్చేసిన జార్వోను భారత స్టార్ విరాట్ కోహ్లీ బయటకు తీసుకెళ్లాడు. భారత వికెట్ కీపర్ KL రాహుల్ మ్యాచ్‌ను ప్రారంభించాలంటే పిచ్‌ను వదిలి వెళ్లమని జార్వోకు సైగ చేశాడు.

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ కు భారత బౌలర్లు షాకుల మీద షాకులు ఇచ్చారు. ఆసీస్ 49.3 ఓవర్లలో 199 పరుగులకు కుప్పకూలింది. స్టీవ్ స్మిత్ (46), వార్నర్ (41), మార్నస్ లబుషేన్ (27) ,మిచెల్ స్టార్క్ (28) కాస్త పోరాడడంతో ఆసీస్ కు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. టీమిండియా బౌలర్లలో జడేజా 3, కుల్దీప్ యాదవ్ 2, బుమ్రా 2, అశ్విన్ 1, సిరాజ్ 1, హార్దిక్ పాండ్యా 1 వికెట్ తీశారు.


Next Story