అహ్మదాబాద్ చేరుకున్న ఊర్వశి రౌతేలా.. ఫేవరెట్ ప్లేయర్ ఎవరు అని అడ‌గ‌డంతో..

ఐసీసీ ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) జ‌ట్ల‌ మధ్య ఈరోజు

By Medi Samrat  Published on  19 Nov 2023 10:44 AM IST
అహ్మదాబాద్ చేరుకున్న ఊర్వశి రౌతేలా.. ఫేవరెట్ ప్లేయర్ ఎవరు అని అడ‌గ‌డంతో..

ఐసీసీ ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) జ‌ట్ల‌ మధ్య ఈరోజుఅహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. మ్యాచ్ ప్రారంభం కావడానికి మరికొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో మ్యాచ్‌ను ఆస్వాదించడానికి బాలీవుడ్ ప్రముఖులు అహ్మదాబాద్‌కు చేరుకుంటున్నారు.

నిన్న, నటుడు వివేక్ ఒబెరాయ్ తన కుమారుడు వివాన్‌తో కలిసి అహ్మదాబాద్ చేరుకున్నారు. తాజాగా ఊర్వశి రౌతేలా కూడా అహ్మదాబాద్ చేరుకుంది. ఊర్వశి వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. అందులో ఆమె టీమ్ ఇండియా విజయం, తన అభిమాన క్రికెటర్ గురించి మాట్లాడింది.

వార్తా సంస్థ ANI తన సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్‌లో ఊర్వశి రౌటేలా వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో ఊర్వశి విమానాశ్రయంలో ఉన్న‌ట్లు కనిపించింది. మీడియా ఆమెని చూసిన వెంట‌నే ప్రపంచ కప్ ఫైనల్ గురించి ప్రశ్నలు అడగడం ప్రారంభించింది.

ఊర్వశి రౌతేలా సమాధానమిస్తూ.. 'నేను చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. భారత్ ప్రపంచకప్ ట్రోఫీని గెలుస్తుందని నమ్ముతున్నాను. ప్రపంచకప్ ట్రోఫీని పట్టుకుని ముద్దాడిన అనుభవాన్ని కూడా పంచుకుంది. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు అని మీడియా ప్రశ్నించగా.. ఆమె బ‌దులిస్తూ మొత్తం టీమ్ నాకు ఇష్టం అని పేర్కొంది.

అక్టోబర్ 15, 2023న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఇండియా, పాకిస్తాన్ ప్రపంచ కప్ మ్యాచ్‌లో తన ఐఫోన్ పోయిందని గతంలో నటి ఊర్వశి రౌతేలా పేర్కొంది. ఆ త‌ర్వాత‌ ఫోన్ దొంగిలించిన వ్యక్తి నుండి మెయిల్ కూడా వచ్చిందని పంచుకుంది. అయితే ఫోన్‌ను దొంగిలించిన వ్యక్తి ఫోన్‌ను తిరిగి ఇవ్వాలంటే.. తన సోదరుడి క్యాన్సర్‌కు చికిత్స చేయించ‌మ‌ని డిమాండ్ చేశాడు.

Next Story