బాబర్ ఆ ఇద్ద‌రినీ తిట్టాడు.. అందుకే ఆఫ్ఘన్ మ్యాచ్‌లో త‌డ‌బ‌డ్డారు..!

పాకిస్థాన్ జట్టు 2023 ప్రపంచ కప్‌ను అద్భుతంగా ప్రారంభించింది. కానీ మొదటి రెండు విజయాల తర్వాత..

By Medi Samrat  Published on  25 Oct 2023 3:52 PM IST
బాబర్ ఆ ఇద్ద‌రినీ తిట్టాడు.. అందుకే ఆఫ్ఘన్ మ్యాచ్‌లో త‌డ‌బ‌డ్డారు..!

పాకిస్థాన్ జట్టు 2023 ప్రపంచ కప్‌ను అద్భుతంగా ప్రారంభించింది. కానీ మొదటి రెండు విజయాల తర్వాత.. పాక్‌ గత మూడు మ్యాచ్‌ల్లో వరుస పరాజయాలను చవిచూసింది. తమ‌కంటే చాలా బలహీనంగా ఉన్న ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టుపై కూడా పాక్‌ ఓటమిని చవిచూసింది. అఫ్గాన్ జట్టుపై ఓటమిని పాక్ మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. బాబర్ అండ్ కంపెనీపై వారు నిరంతరం విమర్శలు గుప్పిస్తున్నారు. పాక్‌ టీమ్ కష్టాల్లో ఉన్నప్పుడు సీనియర్ ఆటగాళ్లు బాబర్‌కు సూచనలు చేసేవారు. కానీ ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అది కనిపించలేదు.

పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ ఉమర్ గుల్ తాజాగా దీనిపై స్పందిస్తూ.. పాకిస్థాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ సందర్భంగా కెప్టెన్ బాబర్ అజామ్‌కు షాదాబ్ ఖాన్, మహ్మద్ రిజ్వాన్ ఎందుకు సూచనలు ఇవ్వలేదో మాట్లాడాడు. బాబర్.. షాదాబ్, రిజ్వాన్‌లను ఒకసారి తిట్టాడని.. దీంతో అఫ్ఘానిస్థాన్‌పై మ్యాచ్ సంద‌ర్భంగా త‌మ బౌలర్లకు సూచనలు ఇవ్వడంలో షాదాబ్, రిజ్వాన్ తడబడ్డార‌ని పేర్కొన్నాడు. అయితే.. మ్యాచ్ సమయంలో జట్టులోని సీనియర్ ఆటగాళ్లు బౌలర్లతో మాట్లాడటం.. అవసరమైనప్పుడు కెప్టెన్‌కు సలహాలు కూడా ఇవ్వడం చేసేవారు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు గుల్‌ను పాకిస్థాన్ బౌలింగ్ కోచ్‌గా నియమించినప్పుడు ఈ సంఘటన జరిగింది.

Next Story