ప్రపంచకప్ ప‌స్ట్ మ్యాచ్ ఆ 11 మందితో ఆడ‌మంటున్న లిటిల్ మాస్టర్

2023 ప్రపంచకప్‌లో భారత జట్టు అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ప్రారంభ మ్యాచ్ ఆడ‌నుంది.

By Medi Samrat  Published on  29 Sept 2023 8:50 PM IST
ప్రపంచకప్ ప‌స్ట్ మ్యాచ్ ఆ 11 మందితో ఆడ‌మంటున్న లిటిల్ మాస్టర్

2023 ప్రపంచకప్‌లో భారత జట్టు అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ప్రారంభ మ్యాచ్ ఆడ‌నుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ముందు భారత జట్టు రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే ఆస్ట్రేలియాతో జరిగే వన్డే మ్యాచ్‌కు భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఇప్పటికే 11 మందిని ఎంపిక చేశాడు.

స్టార్ స్పోర్ట్స్ షోలో సునీల్ గవాస్కర్ టీమిండియా ప్లేయింగ్ 11ని ఎంపిక చేశాడు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లకు ఆ జ‌ట్టులో చోటు క‌ల్పించ‌లేదు. ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్‌పై కూడా వేటు వేశాడు. ఫాస్ట్ బౌలర్లలో షమీ, బుమ్రా, సిరాజ్ త్రయంపై గవాస్కర్ విశ్వాసం వ్యక్తం చేశాడు.

భారత టాప్ ఆర్డర్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీలపై సునీల్ గవాస్కర్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఏ జట్టులోనైనా టాప్-3 బ్యాట్స్‌మెన్‌లే ముఖ్యమని గవాస్కర్ అన్నాడు. ఓపెనర్లు శుభారంభం అందిస్తే ఇతరులు ఆడే లయను అందుకుంటారు. అందువల్ల ఓపెనింగ్ జోడీ ముఖ్యం.

మిడిలార్డర్‌లో శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లపై సునీల్ గవాస్కర్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఆల్ రౌండర్లలో లిటిల్ మాస్టర్.. రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యాలను ఎంపిక చేశాడు. రవిచంద్రన్ అశ్విన్‌ను పట్టించుకోకుండా కుల్దీప్ యాదవ్‌ను స్పిన్నర్‌గా గవాస్కర్ ఎంచుకున్నాడు.

సునీల్ గవాస్కర్ ప్లేయింగ్‌ 11 :

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా.

Next Story