వాళ్లను పేపర్ ప్లేయర్స్ అంటూ తేల్చేసిన గంగూలీ

అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో భారతజట్టు చేతిలో పాకిస్తాన్ ఓటమి పాలైంది.

By Medi Samrat  Published on  17 Oct 2023 9:30 PM IST
వాళ్లను పేపర్ ప్లేయర్స్ అంటూ తేల్చేసిన గంగూలీ

అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో భారతజట్టు చేతిలో పాకిస్తాన్ ఓటమి పాలైంది. ఈ ఓటమి తర్వాత పాక్ జట్టు 2023 ప్రపంచ కప్‌లో పునరాగమనం చేయడం కష్టమని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. 155/2 వద్ద పటిష్టమైన స్థితిలో ఉన్న పాకిస్తాన్.. ఆ తర్వాత దారుణంగా కుప్పకూలింది. కేవలం 191 పరుగులకే ఆలౌట్ అయింది పాక్. ఆ జట్టు బ్యాటింగ్‌ కుప్పకూలడం చూసి ఆశ్చర్యపోయానని అన్నాడు గంగూలీ. ఒకప్పుడు పాక్ జట్టు చాలా బలంగా ఉండేదని.. ఇప్పుడు ఆ జట్టులో సత్తా లేదని అన్నారు.

మేం ఆడేటప్పుడు పాకిస్తాన్ టీమ్ ఇలా ఉండేది కాదు. అది పూర్తిగా డిఫరెంట్ టీమ్. వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలింగ్ ఉండేది. వాళ్ల బ్యాటింగ్ కూడా చాలా పటిష్టంగా ఉండేది.. ఇలాంటి పాక్ టీమ్‌తో మేం ఆడేవాళ్లం కాదన్నారు గంగూలీ. ఇప్పుడున్న పాకిస్తాన్ టీమ్ పేపర్ మీద మాత్రమే పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రెషర్‌ని కూడా తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి బ్యాటింగ్‌తో వరల్డ్ కప్‌‌లో నెట్టుకురావడం చాలా కష్టమేనని తేల్చేశారు. పాకిస్థాన్‌పై రోహిత్ అద్భుతంగా ఆడాడని.. భారత జట్టులో ప్రతి విభాగం బాగా ఉందన్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో సత్తా చాటుతూ ఉండడం భారత్ కు కలిసొచ్చే అంశమన్నారు.

Next Story