అహ్మదాబాద్ చేరుకున్న శుభ్‌మాన్ గిల్.. నెక్ట్స్ పాక్‌తో మ్యాచ్ ఆడ‌ట‌మే త‌రువాయి..!

భారత్-పాక్ మ్యాచ్‌కు ముందు భారత జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ అహ్మదాబాద్ చేరుకున్నాడు.

By Medi Samrat  Published on  12 Oct 2023 9:07 PM IST
అహ్మదాబాద్ చేరుకున్న శుభ్‌మాన్ గిల్.. నెక్ట్స్ పాక్‌తో మ్యాచ్ ఆడ‌ట‌మే త‌రువాయి..!

భారత్-పాక్ మ్యాచ్‌కు ముందు భారత జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ అహ్మదాబాద్ చేరుకున్నాడు. గిల్ బుధవారం రాత్రి అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్టోబర్ 14న భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. గిల్ ఫిట్నెస్ తిరిగి పొంద‌డానికి రెండు రోజుల‌ సమయం ఉంది. గిల్‌ ఫిట్‌గా ఉంటే మాత్రం ఆడటం ఖాయం. ఎందుకంటే ఇషాన్ కిషన్ ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి బంతికే అవుట్ అయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్‌పై కూడా ఇన్నింగ్సు నెమ్మదిగా ప్రారంభించాడు. అయినప్పటికీ పెద్ద ఇన్నింగ్స్‌ ఆడలేకపోయాడు. గిల్ ఫిట్‌గా ఉంటే.. ఇషాన్ కిషన్‌కు ప్లేయింగ్‌-11లో ప్లేస్ ద‌క్క‌దు.

శుభ్‌మాన్ గిల్ అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న వీడియో కూడా సోష‌ల్ మీడియ‌లో వైర‌ల్ అవుతుంది. అందులో గిల్‌ ముసుగు ధరించి భద్రతా సిబ్బందితో అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరినట్లు కనిపించాడు. గిల్‌తో పాటు పాకిస్థాన్ జట్టు కూడా అహ్మదాబాద్ చేరుకుంది. బుధవారం అఫ్ఘానిస్థాన్‌పై టీమ్‌ఇండియా భారీ విజయం సాధించగా.. ఆ త‌ర్వాత‌ భారత ఆటగాళ్లు కూడా అహ్మదాబాద్‌కు చేరుకున్నారు.

ఎయిర్‌పోర్ట్‌లో గిల్ చాలా మామూలుగా కనిపించి డెంగ్యూ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు అనిపించింది. ఇప్పుడు అతను మ్యాచ్‌కి ఫిట్‌నెస్ సాధించాల్సి ఉంటుంది. పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడతాడని పూర్తి ఆశతో ఉన్నాడు. డెంగ్యూ నుండి కోలుకోవడానికి సాధారణంగా ఒక వారం పడుతుంది. గిల్ వంటి ఆటగాళ్ళు త్వరగా కోలుకుంటారు. ఎందుకంటే అతను ఇప్పటికే చాలా ఫిట్‌గా ఉన్నాడు. ఆసియా కప్‌కు ముందు జరిగిన యో-యో టెస్టులో గిల్‌ స్కోరు అత్యధికం కావ‌డం విశేషం.

ఈ ఏడాది భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు శుభ్‌మన్ గిల్. 20 ఇన్నింగ్స్‌ల్లో 1,230 పరుగులు చేశాడు. అతని సగటు 72.35. స్ట్రైక్ రేట్ 105.03. ఈ ఏడాది వన్డేల్లో డబుల్ సెంచరీ కూడా చేశాడు. ప్రపంచకప్‌లో భారత్‌కు శుభ్‌మన్ గిల్ చాలా ముఖ్యమైన బ్యాట్స్‌మెన్. అలాగే అహ్మదాబాద్‌లో గిల్‌ రికార్డు అద్భుతం. దీంతో గిల్‌ జట్టులోకి తిరిగి రావడం భారత్‌కు చాలా సంతోషకరమైన అంశం.

Next Story