ఇంగ్లండ్‌పై అదే త‌ప్పు రిపీట్ చేసిన శ్రేయాస్ అయ్యర్.. ప్లేయింగ్-11 నుంచి తొలగించాలని డిమాండ్.!

లక్నోలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ICC ప్రపంచ కప్-2023 29వ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ మరోసారి తన ప్రదర్శనతో నిరాశపరిచాడు.

By Medi Samrat  Published on  29 Oct 2023 6:34 PM IST
ఇంగ్లండ్‌పై అదే త‌ప్పు రిపీట్ చేసిన శ్రేయాస్ అయ్యర్.. ప్లేయింగ్-11 నుంచి తొలగించాలని డిమాండ్.!

లక్నోలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ICC ప్రపంచ కప్-2023 29వ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ మరోసారి తన ప్రదర్శనతో నిరాశపరిచాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లు అయ్యర్ బలహీనతపై దాడి చేయడంతో భారత్ స్టార్ బ్యాట్స్‌మెన్ అదే తప్పును పునరావృతం చేసి 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. అయ్యర్ ఫ్లాప్ కావడంతో అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

శ్రేయాస్ అయ్యర్ క్రీజులోకి వచ్చేసరికి భారత జట్టు శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీల వికెట్లను కోల్పోయింది. దీంతో అయ్యర్ నుంచి మేనేజ్‌మెంట్ స‌హా అభిమానులు భారీ ఇన్నింగ్స్‌ను ఆశించారు. అయితే 16 బంతులు ఎదుర్కొన్నప్పటికీ అయ్యర్ అంచనాలను అందుకోలేక చ‌తికిల‌ప‌డ్డాడు. అయ్యర్ బలహీనతపై క్రిస్ వోక్స్ దాడి చేసి కేవలం 4 పరుగుల స్కోరు వద్ద అత‌డిని పెవిలియన్‌కు పంపాడు.

అయ్యర్‌కు క్రిస్ వోక్స్ షార్ట్ పిచ్‌ బాల్‌ను సంధించాడు. అయ్యర్‌ బంతిని పుల్ చేసే ప్రయత్నంలో మార్క్ వుడ్‌కు సాధారణ క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. షార్ట్ బంతులను ఎదుర్కోవ‌డంలో అయ్యర్ ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఇదే రీతిలో తన వికెట్ కోల్పోయాడు. అయ్యర్ అవుట‌యిన తర్వాత అభిమానులు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ప్లేయింగ్ లెవెన్ నుంచి అయ్యర్‌ను తొలగించాలని అభిమానులు డిమాండ్ చేశారు.



ఇంగ్లండ్‌పై శ్రేయాస్ అయ్యర్‌తో పాటు విరాట్ కోహ్లి కూడా విఫ‌ల‌మ‌య్యాడు. కోహ్లీ ఖాతా తెరవకుండానే డేవిడ్ విల్లీ బౌలింగ్‌లో పెవిలియన్ బాట ప‌ట్టాడు. ప్రపంచకప్‌లో విరాట్ డకౌట్ కావడం ఇదే తొలిసారి. వరుసగా నాలుగు డాట్ బాల్స్ ఆడిన కోహ్లీ.. భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో బెన్ స్టోక్స్ కు సులువైన క్యాచ్ ఇచ్చాడు.

కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్ మరోసారి బ్యాట్ ఝ‌ళిపించాడు. హిట్‌మ్యాన్ ఒత్తిడిలో అద్భుతంగా బ్యాటింగ్ చేసి 101 బంతుల్లో 81 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు.

Next Story