హిట్ మ్యాన్ మెరుపులు.. పాక్‌పై టీమిండియా విక్టరీ
ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన 12వ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది.
By Medi Samrat Published on 14 Oct 2023 3:12 PM GMTప్రపంచకప్‌లో భాగంగా జరిగిన 12వ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. టోర్నీలో భారత్ వరుసగా మూడో విజయం సాధించింది. టీమిండియా అంతకుముందు ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్‌పై కూడా విజయాలు సాధించింది. మూడు మ్యాచ్‌ల్లో ఆరు పాయింట్లు సాధించి టేబుల్ టాపర్‌గా నిలిచింది. టీం ఇండియా తదుపరి మ్యాచ్.. బంగ్లాదేశ్‌తో అక్టోబర్ 19న పూణెలో జరగనుంది. 20న బెంగుళూరులో ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ జట్టు ఆడనుంది.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన పాక్ జట్టు 42.5 ఓవర్లలో 191 పరుగులకే కుప్పకూలింది. బాబర్ ఆజామ్(50), రిజ్వాన్(49) రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా, కుల్దీప్ యాదవ్, సిరాజ్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం భారత్ 30.3 ఓవర్లలో మూడు వికెట్లకు 192 పరుగులు చేసి విజయం సాధించింది. రోహిత్ శర్మ(86), శ్రేయస్ అయ్యర్(53) పరుగులు చేశారు. ఈ విక్టరీతో ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్‌పై టీమిండియా విజయ పరంపర కొనసాగింది. ప్రపంచకప్ చరిత్రలో పాక్‌పై భారత్ ఎనిమిది మ్యాచ్‌లు ఆడగా.. ప్రతీ మ్యాచ్‌లోనూ విజయం సాధించింది.