కోహ్లీని బౌల్డ్ చేసిన తర్వాత ఎలా ఫీల్ అయ్యాడో చెప్పిన పాట్ కమిన్స్..!
ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగింది.
By Medi Samrat Published on 20 Nov 2023 2:25 PM ISTప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగింది. మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మరోసారి అద్భుతమైన ఫామ్‌లో కనిపించాడు. కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ చూస్తుంటే వన్డే ఫార్మాట్‌లో మరో సెంచరీ పూర్తి చేస్తాడన్న ఆశ కలిగింది. అయితే భారత అభిమానుల ఆశలపై ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ నీళ్లు చల్లాడు. విరాట్ కోహ్లీని బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. దీంతో స్టేడియంలో ఉన్న లక్షా 30 వేల మంది క్రికెట్ అభిమానుల్లో నిరాశ నెలకొంది.
అయితే..మ్యాచ్ ముగిసిన తర్వాత స్టేడియంలో ఉన్న ప్రేక్షకులను శాంతింపజేయడానికి విరాట్ అవుట్ సరైన మార్గమా అని అడిగినప్పుడు? దానికి అతడు నవ్వుతూ 'అవును.. నాకు అలానే అనిపిస్తోంది' అని సమాధానమిచ్చాడు. అభిమానుల నిశ్శబ్దాన్ని గుర్తించడానికి మాకు కొంత సమయం పట్టింది. మ్యాచ్ జరుగుతుండగా ఫామ్‌లో ఉన్న విరాట్ ఈ రోజు కూడా సెంచరీ చేయబోతున్నట్లు అనిపించింది. అయితే అతడు సాధారణ మ్యాచ్‌ల సమయంలో సెంచరీ చేసి.. ఇటువంటి పరిస్థితితులలో అవుటయ్యాడు.. ఆ క్షణం సంతృప్తికరంగా ఉందని పేర్కొన్నాడు.
ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకున్న ఐదో ఆస్ట్రేలియా కెప్టెన్‌గా పాట్ కమిన్స్ నిలిచాడు. మ్యాచ్ అనంతరం 'నేను మళ్లీ 50 ఓవర్ల ఫార్మాట్‌తో ప్రేమలో పడ్డాను' అని చెప్పాడు. మ్యాచ్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్.. విరాట్ కోహ్లీని బౌల్డ్ చేయడం హైలైట్‌గా నిలిచింది. కమిన్స్ వేసిన బంతి కోహ్లి ఊహించిన దానికంటే ఎక్కువగా బౌన్స్ అయి స్టంప్‌ను తాకింది.