పాక్ ఆటగాళ్లకు ఏమైందో తెలుసా.?

భారత్‌తో అహ్మదాబాద్‌ లో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌ ఓడిన తర్వాత బెంగళూరుకు చేరుకుంది పాక్ జట్టు.

By Medi Samrat  Published on  17 Oct 2023 2:15 PM GMT
పాక్ ఆటగాళ్లకు ఏమైందో తెలుసా.?

భారత్‌తో అహ్మదాబాద్‌ లో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌ ఓడిన తర్వాత బెంగళూరుకు చేరుకుంది పాక్ జట్టు. తర్వాతి మ్యాచ్ లో ఆసీస్ తో తలపడనుంది. బాబర్‌ ఆజమ్‌ సారథ్యంలోని పాక్‌ టీమ్‌లో ప్రధాన పేసర్‌ అయిన షహీన్‌ షా అఫ్రిది, అబ్దుల్లా షఫీక్‌, జమాన్‌ ఖాన్‌, ఉసామా మీర్‌లు వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. మంగళవారం ఉదయం ప్రాక్టీస్‌ సెషన్‌కు ఈ ఆటగాళ్లు హాజరుకాలేదు. సాయంత్రం ఆప్షనల్‌ సెషన్‌లో కూడా పలువురు హాజరు కాలేదని చెబుతున్నారు.

శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పాక్ బ్యాటర్ అబ్దుల్లా షఫీక్‌ సెంచరీ చేశాడు. భారత్‌ తో మ్యాచ్‌లో మాత్రం సత్తా చాటలేకపోయాడు. ఈ మ్యాచ్‌ ముగిసిన తర్వాత అతడు వైరల్‌ ఫీవర్‌ బారిన పడ్డాడు. షహీన్‌ షా అఫ్రిది కోలుకున్నాడని.. శుక్రవారం మ్యాచ్ సమయానికి కోలుకుని పూర్తి ఫిట్నెస్‌ సాధిస్తారని పాకిస్తాన్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆశిస్తోంది. వన్డే ప్రపంచకప్‌లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలోనూ ఓడిన ఆస్ట్రేలియా.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది. టైటిల్ ఫెవరెట్లలో ఒక టీమ్ అయిన ఆసీస్ మళ్లీ విజయాల బాట పట్టడం వన్డే ప్రపంచ కప్ లో ఆసక్తికరంగా మారింది. ఆసీస్ ముందు పాకిస్థాన్ ఉంది. పాక్ ను ఓడిస్తారా.. లేక మళ్ళీ పరాజయాన్ని మూటగట్టుకుంటారా అనేది ఇంకొద్ది రోజుల్లో తేలిపోనుంది.

Next Story