world cup-2023: రోహిత్ శర్మ రికార్డుల మోత
అప్ఘానిస్తాన్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
By Srikanth Gundamalla Published on 11 Oct 2023 8:12 PM ISTworld cup-2023: రోహిత్ శర్మ రికార్డుల మోత
భారత్ వేదికగా వరల్డ్క్ కప్ జరుగుతోన్న విషయం తెలిసిందే. అప్ఘానిస్తాన్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అన్ని ఫార్మట్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. రోహిత్‌కు ముందు 553 సిక్సర్లతో అత్యధిక సిక్స్‌లు కొట్టినఆటగాడిగా క్రిస్ గేల్ ఉన్నాడు. తాజా ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ క్రిస్ గేల్‌ను దాటాడు. గేల్ 551 ఇన్నింగ్సుల్లో 553 సిక్సర్లు బాదాడు. కానీ.. రోహిత్ 473 ఇన్నింగ్స్‌లో 554 సిక్సర్లు బాదాడు. అయితే.. క్రిస్ గేల్‌కు రోహిత్ శర్మకు మధ్య 78 ఇన్నింగ్స్‌ల తేడా ఉన్నాయి.
ఇక ఇప్పుడు అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లలో ప్రస్తుతం రోహిత్‌కు దరిదాపుల్లో ఎవరూ కనపడటం లేదు. మార్టిన్ గప్తిల్ 383 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ 312 సిక్సర్లతో 10వ స్థానంలో, విరాట్ కోహ్లి 282 సిక్సర్లతో 11వ స్థానంలో ఉన్నారు.ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో ఇంగ్లాండ్ బ్యాటర్ జోస్ బట్లర్ ఒక్కడే 315 సిక్స్‌లతో టాప్ 10లో చివరి ప్లేస్‌లో ఉన్నాడు. ఈ టాప్ టెన్‌లో మిగిలిన బట్లర్, రోహిత్ తప్ప మిగిలిన ఆటగాళ్లందరూ రిటైర్ అయిపోయారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన టాప్-5 బ్యాటర్లు వీరే:
రోహిత్ శర్మ - (భారత్ )554 సిక్సర్లు
క్రిస్ గేల్ - (వెస్టిండీస్ )553 సిక్సర్లు
షాహిద్ అఫ్రిదీ - (పాకిస్థాన్) 476 సిక్సర్లు
బ్రెండన్ మెకల్లమ్ - (న్యూజిలాండ్) 389 సిక్సర్లు
మార్టిన్ గప్టిల్ - (న్యూజిలాండ్ )383 సిక్సర్లు
రోహిత్ శర్మ తన కెరీర్‌లో ప్రస్తుతం మూడో వన్డే వరల్డ్ కప్ ఆడుతున్నాడు. రోహిత్ ప్రపంచ కప్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన భారత ఆటగాడిగా కపిల్ దేవ్ రికార్డును కూడా అధిగమించాడు. గతంలో కపిల్ దేవ్ 72 బంతుల్లో సెంచరీ సాధించాడు. కానీ.. అప్ఘాన్‌పై రోహిత్ 63 బంతుల్లోనే సెంచరీ చేసి.. ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రికార్డుకెక్కాడు. కాగా.. రోహిత్ ఆడిన మూడు టోర్నీల్లో రోహిత్ 18 మ్యాచుల్లో కలిపి 978 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు ఉన్నాయి. 2015లో ఒక సెంచరీ బాదగా.. 2019లో ఏకంగా 5 శతకాలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ వెయ్యి పరుగుల మైలురాయిని కూడా చేరుకున్నాడు. ప్రపంచకప్‌లో వేగంగా వెయ్యిపరుగులు చేసిన ఆటగాళ్లుగా వార్నర్(19), రోహిత్(19) కొనసాగుతున్నారు.