పీసీబీ చీఫ్ సెలక్టర్ పదవికి ఇంజమామ్ ఉల్ హక్ రాజీనామా..
వన్డే ప్రపంచ కప్ 2023లో పాకిస్తాన్ నిరాశాజనక ప్రదర్శన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్‌లో పెను మార్పులు
By Medi Samrat Published on 30 Oct 2023 3:56 PM GMTవన్డే ప్రపంచ కప్ 2023లో పాకిస్తాన్ నిరాశాజనక ప్రదర్శన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్‌లో పెను మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఇంజమామ్-ఉల్-హక్ చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామా చేశాడు. ప్రపంచకప్‌లో పాక్ వరుసగా నాలుగో ఓటమి తర్వాత.. ఇంజమామ్ తన రాజీనామాను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ జకా అష్రాఫ్‌కు పంపాడు.
చీఫ్ సెలక్టర్‌గా ఇంజమామ్ కాంట్రాక్ట్ గడువు ముగిసిందని తెలుస్తోంది. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కష్టాలు పెరిగే అవకాశం ఉంది. పాక్ మీడియా నివేదికల ప్రకారం.. ఇంజమామ్ ఆరు నెలలుగా జీతం పొందలేదు. అతని రాజీనామా తర్వాత బోర్డు అతనికి 1.5 కోట్ల పాకిస్తానీ రూపాయలను చెల్లించవలసి ఉంటుంది. ఇంజమామ్ నెల జీతం 25 లక్షల పాకిస్థానీ రూపాయలు.
ఇంజమామ్ రాజీనామా ప్రకటనపై మాట్లాడుతూ.. పరిశోధన లేకుండానే మాట్లాడతారు. నాపై ప్రశ్నలు తలెత్తినప్పుడు, నేను రాజీనామా చేస్తే బాగుంటుందని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు.
మీడియా నివేదికల ప్రకారం.. ప్లేయర్స్ ఏజెంట్ ఫర్మ్‌లో వాటా విషయమై ఇంజమామ్ ఉల్ హక్ వివాదంలోకి వచ్చాడు. యాజో ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో ఇంజమామ్‌కు వాటా ఉంది. ఈ కంపెనీ యజమాని తల్హా రెహ్మానీ. రెహ్మానీ ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ జట్టులోని కీలక ఆటగాళ్లలో బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్, షాహీన్ షా ఆఫ్రిదీల వ్యవహారాలను చూస్తున్నారు. ఇంజమామ్‌పై పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలు రావడానికి ఇదే కారణంగా పాక్ మీడియా చెబుతుంది.