పరుగుల వరద పారించిన క్లాసెన్, జాన్సెన్
ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య 20వ మ్యాచ్ జరుగుతోంది.
By Medi Samrat Published on 21 Oct 2023 1:03 PM GMTఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య 20వ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ టెంబా బావుమా గైర్హాజరీలో బ్యాటింగ్ కు వచ్చిన దక్షిణాఫ్రికా పరుగుల వరద పారించింది. 50 ఓవర్ల ఆట ముగిసేసరికి ఆఫ్రికా 399 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో గెలవాలంటే 400 పరుగులు చేయాలి. ఇంగ్లండ్‌కు ఈ లక్ష్యం అంత సులభం కాదు.
క్వింటన్ డి కాక్ రెండో బంతికే అవుటవడంతో ఆఫ్రికా పెద్దగా స్కోర్ చేయలేదేమో అనిపించినా రీజా హెండ్రిక్స్ 85 పరుగులు, రాస్సీ వాన్ డెర్ డస్సెన్(60) జట్టుకు శుభారంభాన్ని అందించారు. 125 పరుగుల వద్ద ఆఫ్రికా రెండో వికెట్ పడింది. హెన్రిచ్ క్లాసెన్ అద్భుత సెంచరీ చేశాడు. కేవలం 67 బంతుల్లో 109 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇది కాకుండా మార్కో జాన్సెన్ కూడా 75 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్ కారణంగా దక్షిణాఫ్రికా 50 ఓవర్ల ఆట ముగిసేసరికి 399 పరుగులు చేయగలిగింది.
ఇంగ్లండ్ బౌలర్ రీస్ టాప్లీ ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడటంతో మైదానం వీడాల్సి వచ్చింది. అయితే తర్వాత బౌలింగ్‌కు వచ్చి రెండు వికెట్లు(మొత్తం మూడు వికెట్లు) కూడా తీశాడు. స్పిన్ బౌలర్ ఆదిల్ రషీద్ 2 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో విజయం ఇంగ్లండ్‌కు చాలా కీలకం. ఇంగ్లండ్ తొలి 3 మ్యాచ్‌ల్లో కేవలం ఒక విజయంతో ఆరో స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా మొదటి 3 మ్యాచ్‌ల్లో 2 గెలిచి మూడో స్థానంలో ఉంది.