ఆఫ్ఘనిస్థాన్ ముందు భారీ టార్గెట్

వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా చెన్నై వేదికగా న్యూజిలాండ్‌ – ఆఫ్ఘనిస్థాన్ జట్లు తలపడుతున్నాయి.

By Medi Samrat  Published on  18 Oct 2023 1:09 PM GMT
ఆఫ్ఘనిస్థాన్ ముందు భారీ టార్గెట్

వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా చెన్నై వేదికగా న్యూజిలాండ్‌ – ఆఫ్ఘనిస్థాన్ జట్లు తలపడుతున్నాయి.ఈ మ్యాచ్ లో కివీస్ ఆటగాళ్లు గ్లెన్‌ ఫిలిప్స్‌ (74 బంతుల్లో 71, 4 ఫోర్లు, 4 సిక్సర్లు ), కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ (74 బంతుల్లో 68, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) లు రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.

ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లు ఒకానొక దశలో మ్యాచ్ పై పట్టు సాధించారు. 110 పరుగులకి కివీస్ 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డట్టు కనిపించింది. అయితే ఆ తర్వాత లాథమ్, గ్లెన్ ఫిలిప్స్ అద్భుతంగా ఆడారు. 254 పరుగుల వరకూ మరో వికెట్ పడకుండా అడ్డుకోగలిగారు. దీంతో కివీస్ పెద్ద ప్రమాదం నుండి బయట పడింది. విల్‌ యంగ్‌ (64 బంతుల్లో 54, 4 ఫోర్లు, 3 సిక్సర్లు), వన్‌ డౌన్‌లో వచ్చిన రచిన్‌ రవీంద్ర (41 బంతుల్లో 32 , 2 ఫోర్లు, 1 సిక్సర్‌) రాణించారు. 20 వ ఓవర్లో 108-1గా ఉన్న కివీస్ స్కోరు.. 21.4 ఓవర్‌కు వచ్చేసరికి 110-4గా మారడంతో కివీస్ శిబిరంలో టెన్షన్ మొదలైంది. ఆ తర్వాత కెప్టెన్ లాథమ్ రాకతో అంతా సెట్ అయింది. 69 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేసిన ఫిలిప్స్‌ ఆ తర్వాత బాగా ఆడాడు. 43 ఓవర్లకు 205 పరుగులే ఉన్న కివీస్‌ స్కోరు బోర్డును ఫిలిప్స్‌ ఆ తర్వాత పరుగులు పెట్టించాడు. ఫజల్లా ఫరూఖీ వేసిన 45వ ఓవర్లో ఫిలిప్స్‌ రెండు భారీ సిక్సర్లు బాదాడు. చివర్లో వచ్చిన మార్క్‌ చాప్‌మన్‌ (25 నాటౌట్‌), మిచెల్‌ శాంట్నర్‌ (7 నాటౌట్‌)లు కివీస్‌ స్కోరును 280 దాటించారు. భారీ స్కోరును ఆఫ్ఘన్ బ్యాటర్లు ఛేజ్ చేస్తారో లేదో చూడాలి.

Next Story