రోహిత్ శర్మ 'జెర్సీ నంబర్ 46' ఉండాలంటున్న మాజీ ఐపీఎస్.. ఎందుకు.?
2023 ప్రపంచకప్‌లో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటి వరకు టోర్నీలో అతడు 550 పరుగులు చేశాడు.
By Medi Samrat Published on 17 Nov 2023 10:15 AM GMT2023 ప్రపంచకప్‌లో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటి వరకు టోర్నీలో అతడు 550 పరుగులు చేశాడు. ప్రతి మ్యాచ్‌లోనూ రోహిత్ జట్టుకు శుభారంభం ఇస్తున్నాడు. తొలి బంతి నుంచే రోహిత్ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ ఫోర్లు, సిక్సర్లు బాదడం ప్రారంభిస్తున్నాడు. ఇలా జట్టు విజయంలో కెప్టెన్ రోహిత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే.. ఓ మాజీ IPS సోషల్ మీడియాలో రోహిత్ శర్మ గురించి ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు.. దానిపై నెటిజన్లు కూడా సమాధానాలు ఇస్తున్నారు.
మాజీ ఐపీఎస్ ఆర్‌కే విజ్ రోహిత్ శర్మ చిత్రాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేసాడు. ఈ పోస్ట్ క్యాప్షన్‌లో.. రోహిత్ శర్మ జెర్సీ నంబర్ 4 అండ్ 6, 46 ఉండాలి.. ఎందుకు చెప్పండి? మాజీ ఐపీఎస్ ప్రశ్నించారు. ఈ పోస్ట్‌పై ప్రజలు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. పోస్ట్‌పై చాలా మంది రోహిత్ శర్మ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నందున అతని జెర్సీ నంబర్ 45 కాదు 46 అని రాశారు. రోహిత్ ఫోర్లు, సిక్సర్లు మాత్రమే కొడతాడని మరో యూజర్ రిప్లై ఇచ్చాడు. అయితే.. మరో ట్వీట్ చేయకపోవడంతో మాజీ ఐపీఎస్ ఉద్దేశం కూడా అదే అని భావిస్తున్నారు అభిమానులు.
#रोहित_शर्मा की जर्सी का नम्बर 4 एन्ड 6, 46 होना चाहिये था, बताओ क्यों?#RohitSharma𓃵_45 #INDVSNZ pic.twitter.com/ZhxOzGAhBL
— RK Vij (@ipsvijrk) November 15, 2023
2023 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ నుండి అభిమానులు మరో వేగవంతమైన, పెద్ద ఇన్నింగ్స్‌ను ఆశిస్తున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమ్ ఇండియా ఫైనల్స్‌కు చేరుకుంది. తన కెప్టెన్సీలో భారత్ వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇంతకు ముందు భారత జట్టు రెండుసార్లు వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది.