ఆ 99 మీటర్ల సిక్స్‌కు షాక్ అయిన దిగ్గజాలు..!
ప్రపంచకప్-2023లో భాగంగా జరిగిన 31వ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది
By Medi Samrat Published on 1 Nov 2023 12:30 PM GMTప్రపంచకప్-2023లో భాగంగా జరిగిన 31వ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో పాక్ ఓపెనర్ ఫఖర్ జమాన్ రాణించాడు. ఫఖర్ జమాన్ బంగ్లాదేశ్‌పై 74 బంతులు ఎదుర్కొని 109.46 స్ట్రైక్ రేట్‌తో 81 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్‌లో ఫఖర్ జమాన్ అద్భుతమైన సిక్సర్లు కొట్టాడు. అందుకు సంబంధించి ఒక సిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫాస్ట్ బౌలర్ తస్కిన్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ ఐదవ ఓవర్ ఓవర్లో ఫఖర్ స్క్వేర్ లెగ్ ఏరియాపై అద్భుతమైన సిక్సర్ బాదాడు. ఆ షాట్ కొట్టిన తర్వాత అతనే ఆశ్చర్యంగా చూసి నవ్వడం మొదలుపెట్టాడు. ఫఖర్ జమాన్ కొట్టిన ఆ సిక్స్ 99 మీటర్ల దూరంలో పడింది. ఆ షాట్‌ను కామెంటరీ బాక్స్‌లో ఉన్న వ్యాఖ్యతలు కూడా ఎంతో మెచ్చుకున్నారు.
What a sixxx
— ali Atish (@haiyder54) November 1, 2023
Fakhar zaman ❤️💕❤️#PAKvBAN #Fakharzaman #PakistanCricket #CWC23 pic.twitter.com/aGLNG1UdlO
రవిశాస్త్రి బంతి ఎయిర్‌లో ఉండగా మాట్లాడుతూ.. 'ఎంత అద్భుతమైన శబ్ధం.. మంచి షాట్' అని ఆశ్యర్యం వ్యక్తం చేయగా.. పాక్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ మాట్లాడుతూ.. 'వావ్. 95 మీటర్లు. ఇప్పటి వరకు ఇదే అతి పెద్ద సిక్స్ అని నా అంచనా అంటూ మెచ్చుకున్నారు. ఈ ఇద్దరు దిగ్గజాలతో పాటు ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ మాట్లాడుతూ.. ఇలాంటి బంతులను భారీ షాట్లు కొట్టే బ్యాట్స్‌మెన్‌లు ప్రపంచంలో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారని కొనియాడాడు.
బంగ్లాదేశ్‌పై అద్భుతమైన హాఫ్ సెంచరీ చేసిన ఫఖర్ జమాన్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు. 74 బంతుల్లో మూడు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 81 పరుగులు చేశాడు.