ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 13వ ఎడిషన్ ప్రారంభమైంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. చాలా కాలంగా అందరూ వరల్డ్ కప్ కోసం ఎదురు చూస్తున్నారు. నిర్వాహకులు కూడా వరల్డ్ కప్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్ అందరినీ నిరాశపరిచింది.
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన నరేంద్ర మోదీ మైదానం అభిమానుల దృష్టిని ఆకర్షించడంలో విఫలమైంది. రూ. 1,000 కంటే తక్కువ టిక్కెట్లు అందుబాటులో ఉన్నా అభిమానులు హాజరుకాలేదు. ఆట జరుగుతున్న సమయంలో టిక్కెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఓపెనింగ్ వేడుక కూడా జరగకపోవడం అభిమానులకు నిరాశను పెంచింది. ఖాళీ సీట్ల ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు వాటిపై కామెంట్లు చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. 2019 ఫైనల్‌లో ఈ రెండు జట్లు ఒకదానితో ఒకటి తలపడ్డాయి, ఆ మ్యాచ్‌లో ఉత్కంఠ హద్దులు దాటింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 33 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది.