పాక్‌పై వార్నర్ సెంచరీ.. వైరల్‌గా మారిన 'పుష్ప' సెలబ్రేషన్
ICC క్రికెట్ వరల్డ్ 2023లో భాగంగా నేడు పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతోంది.
By Medi Samrat Published on 20 Oct 2023 6:15 PM ISTICC క్రికెట్ వరల్డ్ 2023లో భాగంగా నేడు పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఈ మ్యాచ్‌లో కంగారూ జట్టు ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ అద్భుత సెంచరీ సాధించాడు. సెంచరీ తర్వాత డేవిడ్ వార్నర్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన తాజా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో వార్నర్ తన సెంచరీ సెలబ్రేషన్ 'పుష్ప' స్టైల్‌లో జరుపుకున్నాడు.
పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ అద్భుతమైన బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. ఆరంభం నుంచి పాక్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్న వార్నర్.. తనదైన స్టైల్ లో సెంచరీ చేసి ఆస్ట్రేలియా జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు.
The Pushpa Warrior 😍 #DavidWarner #AUSvsPAK #PAKvsAUS pic.twitter.com/w3kgmNiMwb
— Nimish_20 (@shirsat_nimish) October 20, 2023
ఇన్నింగ్స్ 30వ ఓవర్లో పాక్ బౌలర్ మహ్మద్ నవాజ్ వేసిన బంతికి సింగిల్ తీసి డేవిడ్ వార్నర్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ చేసిన తర్వాత డేవిడ్ వార్నర్ మైదానంలో చాలా సంతోషంగా కనిపించాడు. అల్లు అర్జున్ 'పుష్ప' ఐకాన్ స్టైల్‌లో సెలబ్రేషన్ జరుపుకున్నాడు. డేవిడ్ వార్నర్ సంబరాలకు సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డేవిడ్‌ను నెటిజన్లు జూనియర్ పుష్ప అని పిలుస్తున్నారు.