నిన్న మ్యాక్స్ వెల్.. నేడు స్టోక్స్
ఆఫ్ఘనిస్థాన్ మీద ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మ్యాక్స్ వెల్ ఆడిన ఆటకు క్రికెట్ అభిమానులు ఫిదా అయ్యారు
By Medi Samrat Published on 8 Nov 2023 1:17 PM GMTఆఫ్ఘనిస్థాన్ మీద ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మ్యాక్స్ వెల్ ఆడిన ఆటకు క్రికెట్ అభిమానులు ఫిదా అయ్యారు. ఇంత అద్భుతంగా ఆడిన అతడిని అభిమానులు ప్రశంసించలేకుండా ఉండలేకపోతున్నారు. ఇక నేడు నెదర్లాండ్స్ పై ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ విరుచుకుపడ్డాడు. మెగా టోర్నీలో ఇప్పటికే నిష్క్రమించిన ఇంగ్లాండ్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీకు అర్హత సాధించే పనిలో ఉంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 339 పరుగుల భారీ స్కోర్ చేసింది. మిగిలిన వాళ్ళు వికెట్లు ఇచ్చేస్తున్న దశలో స్టోక్స్ సెంచరీ బాదేశాడు. 77 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న స్టోక్స్.. 84 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులతో 108 పరుగులు చేసి చివరి ఓవర్లో ఔటయ్యాడు. స్టోక్స్ తో పాటు ఓపెనర్ డేవిడ్ మలన్ 87 పరుగులకు చేసి ఇంగ్లాండ్ కు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 133 పరుగులు చేసిన ఇంగ్లండ్ ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. దీంతో 192 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో స్టోక్స్ కు వోక్స్(51) జతకలవడంతో 129 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో బేస్ డీ లీడ్ 3 వికెట్లు తీసుకోగా.. ఆర్యన్ దత్, వాన్ భీక్ రెండేసి వికెట్లు తీసుకున్నారు.