బాదేసిన ఆస్ట్రేలియా.. బై బై బంగ్లా
వన్డే ప్రపంచకప్ 2023లో ఆస్ట్రేలియా వరుస విజయాలు సాధించింది.
By Medi Samrat Published on 11 Nov 2023 1:05 PM GMTవన్డే ప్రపంచకప్ 2023లో ఆస్ట్రేలియా వరుస విజయాలు సాధించింది. పూణే వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆసీస్ కు ఇది వరుసగా ఏడో విజయం. 307 పరుగుల భారీ లక్ష్యాన్ని 45.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది ఆస్ట్రేలియా. మిచెల్ మార్ష్ (177 నాటౌట్; 132 బంతుల్లో 17 ఫోర్లు, 9 సిక్సర్లు) భారీ శతకంతో విధ్వంసం సృష్టించాడు. స్టీవ్ స్మిత్ (63 నాటౌట్; 64 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ వార్నర్ (53; 61 బంతుల్లో 6 ఫోర్లు) లు రాణించాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్ చెరో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది. బంగ్లా బ్యాటర్లు రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. హృదయ్ 79 బంతుల్లో 74 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓపెనర్లు టాంజిద్ హసన్ 36, లిటన్ దాస్ 36 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. కెప్టెన్ శాంటో 45 పరుగులు చేసి రాణించాడు. మహమ్మదుల్లా 32, ముషఫికర్ రహీం 23 పరుగులు చేశారు. మెహదీ హసన్ మిరాజ్ 20 బంతుల్లోనే 29 పరుగులు చేసి బంగ్లా స్కోర్ ను 300 దాటించాడు. ఆసీస్ బౌలర్లలో జంపా, అబాట్ రెండు వికెట్లు తీసుకోగా.. స్టోయినీస్ కు ఒక వికెట్ దక్కింది. బంగ్లా జట్టు ఏకంగా మూడు వికెట్లను రనౌట్లుగా చేజార్చుకున్నారు.