World Cup Final : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

2023 ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది

By Medi Samrat  Published on  19 Nov 2023 1:55 PM IST
World Cup Final : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

2023 ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్లు త‌మ‌ ప్లేయింగ్‌-11లో ఎలాంటి మార్పులు చేయలేదు. టోర్నమెంట్‌లో ఇప్పటివరకు ఒక్క ఓట‌మి లేకుండా భారత్ అజేయంగా ఉంది. ఆస్ట్రేలియా తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

ప్రపంచకప్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌ల గణాంకాల గురించి మాట్లాడితే.. ఆస్ట్రేలియాదే పైచేయి. ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు 13 సార్లు తలపడ్డాయి. ఆస్ట్రేలియా జట్టు 8 సార్లు గెలుపొందగా.. భారత్ 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.=

భారత్ (ప్లేయింగ్ XI):

రోహిత్ శర్మ (సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వి), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్‌

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI):

ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్(w), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(సి), ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

Next Story